Share News

వైభవంగా శ్రీవేంకటేశ్వరస్వామి కల్యాణం

ABN , Publish Date - May 14 , 2025 | 11:39 PM

మల్లవరంలోగుని గుండ్లకమ్మ ప్రాజెక్టు చెంత ఉన్న శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయంలో బుధవారం స్వామివారి కల్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. ఉభయ దేవేరులతో స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించి అర్చకులు కల్యాణ క్రతువు నిర్వహించారు

వైభవంగా శ్రీవేంకటేశ్వరస్వామి కల్యాణం
అమ్మవారి మంగళసూత్రాలను భక్తులకు చూపిస్తున్న అర్చకులు

మల్లవరంనకు భారీగా తరలివచ్చిన భక్తులు

స్వామివార్లకు పట్టువస్ర్తాలను సమర్పించిన ఎమ్మెల్యే విజయ్‌కుమార్‌

మద్దిపాడు, మే 14(ఆంధ్రజ్యోతి): మల్లవరంలోగుని గుండ్లకమ్మ ప్రాజెక్టు చెంత ఉన్న శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయంలో బుధవారం స్వామివారి కల్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. ఉభయ దేవేరులతో స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించి అర్చకులు కల్యాణ క్రతువు నిర్వహించారు. శ్రీవారి కల్యాణం తిలకించేందుకు దాదాపు 25 వేల మంది భక్తులు తరలిరావడంతో ఆలయ అధికారులు అందకనుగుణంగా ఏర్పాట్లు చేశారు. ఆలయ ప్రధాన అర్చకులు నారాయణం వెంకటాచార్యులు, రవికుమార్‌, కొండూరి శ్రీనివాస్‌ అయ్యంగార్‌, దివి వెంకటశేషాచార్యులు ఆధ్వర్యంలో స్వామివారి కల్యాణం జరిపించారు. ఈ సందర్భంగా స్వామివార్లకు ఎమ్మెల్యే బీఎన్‌.విజయ్‌కుమార్‌ ముఖ్యఅతిథిగా విచ్చేసి పట్టువస్ర్తాలను సమర్పించారు. ఆలయ ఈవో దామా నాగేశ్వరరావు ఎమ్మెల్యేకు శాస్ర్తోక్తంగా పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఉభయ దాతలుగా మహాలక్ష్మమ్మ, ఎర్రరెడ్డి దంపతులు, పల్లకి సుబ్బరామిరెడ్డి మనువలు వ్యవహరించారు. ఇక సంపత్‌కుమార్‌, గాలి రాఘవవరప్రసాద్‌, అద్దంకి శ్రీరామచంద్రమూర్తి, అద్దంకి మురళీకృష్ణ, వింజనంపాటి సారథి ఆలపించిన నారాయణ తీర్ధ తరంగాలు భక్తులను మంత్రముగ్ధులను చేశాయి. మల్లవరం అన్నదాన కమిటీ నిర్వాహకులు నారిపెద్ది వరహాలుచౌదరి, శ్రీవారి వనం కమిటీ సభ్యులు మార్నేని కృష్ణారావు, కావూరి వాసుబాబు, మార్నేని సుబ్బారావు, మార్నేని రాఘవరావు, మన్నం శ్రీనివాస్‌, తేళ్ల వెంకటసుబ్బారావు, చెరుకూరి రమే్‌షబాబు ఆధ్వర్యంలో భక్తులకు అన్నప్రసాద వితరణ చేశారు. అదేవిధంగా బ్రాహ్మణ సేవా సంఘం, ఆర్యవైశ్య సంఘం, ఇతర పలు సంఘాల ఆధ్వర్యంలో మజ్జిగ పంపిణీ జరిగింది. టీడీపీ మండల అధ్యక్షుడు మండవ జయంత్‌బాబుతో పాటు పలువురు తెలుగుదేశం, జనసేన పార్టీ నాయకులు పాల్గొన్నారు.

శ్రీవేంకటేశ్వర స్వామి కళ్యాణోత్సవం పురస్కరించుకుని పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఒంగోలు రూరల్‌ సీఐ శ్రీకాంత్‌బాబు పర్యవేక్షణలో నాగులుప్పలపాడు, మద్దిపాడు, ఎస్‌ఎన్‌ పాడు, చీమకుర్తి పోలీసులు బందోబస్తులో పాల్గొన్నారు. మద్దిపాడు పీహెచ్‌సీ వైద్యులు ఆలయం వద్ద వైద్యశిబిరం నిర్వహించారు. ఇక వైసీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి, మాజీ మంత్రి మెరుగ నాగార్జున స్వామివారిని దర్శించుకుని పూజలో పాల్గొన్నారు. ఆయన వెంట ఎంపీటీసీ సభ్యుడు వాకా కోటిరెడ్డి, ఘడియపూడి సర్పంచ్‌ బొమ్మల రామాంజనేయులు, ఎంపీటీసీ పైనం ప్రభాకర్‌, పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Updated Date - May 14 , 2025 | 11:39 PM