ప్రజా సమస్యల పరిష్కారమే ప్రభుత్వ లక్ష్యం
ABN , Publish Date - Jul 21 , 2025 | 10:46 PM
నిరంతరం ప్రజాసమస్యలను గుర్తిస్తూ వాటి పరిష్కారం దిశగా ప్రభు త్వం కృషి చేస్తుందని ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డి అన్నారు. మండలంలోని ఆదిమూర్తిపల్లి, ఉయ్యాలవాడ గ్రామాలలో సోమవారం జరిగిన సుపరిపాలన లో తొలిఅడుగు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఏడాది పాలనలో ప్రభు త్వం చేసిన అభివృద్ధి, సంక్షేమాన్ని ప్రజలకు వివరిస్తూ కరపత్రాలను అందించారు.
ఎమ్మెల్యే అశోక్‌రెడ్డి
ఉయ్యాలవాడలో సుపరిపాలనలో తొలి అడుగు
గిద్దలూరు టౌన్, జూలై 21 (ఆంధ్రజ్యోతి): నిరంతరం ప్రజాసమస్యలను గుర్తిస్తూ వాటి పరిష్కారం దిశగా ప్రభు త్వం కృషి చేస్తుందని ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డి అన్నారు. మండలంలోని ఆదిమూర్తిపల్లి, ఉయ్యాలవాడ గ్రామాలలో సోమవారం జరిగిన సుపరిపాలన లో తొలిఅడుగు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఏడాది పాలనలో ప్రభు త్వం చేసిన అభివృద్ధి, సంక్షేమాన్ని ప్రజలకు వివరిస్తూ కరపత్రాలను అందించారు. ఈ సందర్భంగా ఆయన ఆయా గ్రామాలలో నెలకొన్న సమస్యలను ప్రజ ల ద్వారా అడిగి తెలుసుకున్నారు. ఉయ్యాలవాడలో రూ.10లక్షలతో నిర్మించనున్న సిమెంట్ రోడ్డుకు ఆయన శంకుస్థాపన చేశారు. గత వైసీపీ పాలకులు అరాచకం సృష్టించడం తప్ప చేసిందేమి లేదని అన్నారు. బటన్ నొక్కడం తప్ప తట్ట మట్టిపోసి గుంతను కూడా పూడ్చలేదని ఎద్దేవా చేశారు. అన్ని వర్గాల ప్రజలను మోసగించిన వైసీపీ నాయ కులకు ప్రశ్నించే అర్హత లేదని, గత ఐదేళ్లలో వారు చేసిన అరాచకానికి ప్రజలు తగిన బుద్ది చెప్పినా మార్పు రాలేదన్నారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు విఠా రమేష్, చెన్నబోయిన రామకృష్ణ, విఠా ప్రసాద్, గ్రామ పార్టీ అధ్యక్షుడు మండ్ల శ్రీనివాసులు, జడ్పీటీసీ సభ్యుడు బుడత మధుసూదన్, సొసైటీ బ్యాంక్ చైర్మన్ రామసుబ్బయ్య, టీడీపీ నాయకులు బైలడుగు బాలయ్య, కడియం శేషగిరి, ఆవుల రాజగోపాల్, నంది శ్రీను, బోదనబోయిన గోపాలక్రిష్ణ, దప్పిలి శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు.
పెద్ద దోర్నాల : మండలంలోని పెద్ద బొమ్మలాపురం పడమటి పల్లెలో సుపరిపాలనలో తొలిఅడుగు కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు. ఈ సంధర్భంగా ఈదర మల్లయ్య ప్రతి ఇంటింటికీ వెళ్లి ఏడాది పాలనలో ప్రజా ప్రభుత్వం చేసిన అభివృద్ధి, పథకాలను ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా కరపత్రాలను పంపిణీ చేశారు. కార్యక్రమంలోనాయకులు అమ్మిరెడ్డి వెంకటేశ్వరరెడ్డి, మల్లారెడ్డి, ఏసురత్నం, నరేష్, ఈశ్వరయ్య, గురవయ్య దాన మయ్య పాల్గొన్నారు.