Share News

యువతకు ఉద్యోగావకాశాల కల్పనే ప్రభుత్వ లక్ష్యం

ABN , Publish Date - Oct 11 , 2025 | 10:41 PM

యువతకు ఉద్యోగావకాశాలు కల్పించటమే ప్రభుత్వ లక్ష్యమని టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ డాక్టర్‌ గొట్టిపాటి లక్ష్మి అన్నారు. మెగా డీఎస్సీ ద్వారా దర్శి నియోజకవర్గంలో టీచర్‌ పోస్టులు సాధించిన 59 మంది ఉపాధ్యాయులను శనివారం స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో సన్మానించారు.

యువతకు ఉద్యోగావకాశాల కల్పనే ప్రభుత్వ లక్ష్యం
డీఎస్సీ ద్వారా ఉపాధ్యాయ పోస్టులు పొందిన టీచర్లను సన్మానిస్తున్న డాక్టర్‌ గొట్టిపాటి లక్ష్మి, పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే పాపారావు తదితరులు

టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ డాక్టర్‌ గొట్టిపాటి లక్ష్మి

దర్శి, అక్టోబరు 11(ఆంధ్రజ్యోతి): యువతకు ఉద్యోగావకాశాలు కల్పించటమే ప్రభుత్వ లక్ష్యమని టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ డాక్టర్‌ గొట్టిపాటి లక్ష్మి అన్నారు. మెగా డీఎస్సీ ద్వారా దర్శి నియోజకవర్గంలో టీచర్‌ పోస్టులు సాధించిన 59 మంది ఉపాధ్యాయులను శనివారం స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో సన్మానించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌ సారథ్యంలో కూటమి ప్రభుత్వం అభివృద్ధి పథంలో ముందకు సాగుతుందన్నారు. ప్రతి ఏడాది డీఎస్సీ నిర్వహించి యువతకు ఉద్యోగాలు కల్పించటం జరుగుతుందన్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో ఒక్క డీఎస్సీ కూడా నిర్వహించలేకపోవటం వారి అసమర్థతకు నిదర్శనమన్నారు. ఉద్యోగాలు సాధించిన యువతీ యువకులు విద్యార్థులకు ఉత్తమ బోధన అందించి మంచిపేరు తెచ్చుకోవాలన్నారు. అంతర్జాతీయ బాలికల దినోత్సవం సందర్భంగా విద్యార్థినులకు శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే నారపుశెట్టి పాపారావు, టీడీపీ నియోజకవర్గ నాయకుడు డాక్టర్‌ కడియాల లలిత్‌సాగర్‌, ఏఎంసీ చైర్మన్‌ దారం నాగవేణి, సుబ్బారావు, దర్శి, దొనకొండ, కురిచేడు, ముండ్లమూరు ఎంఈవోలు కె.రఘురామయ్య, రమాదేవి, సాంబశివరావు, సీహెచ్‌ సుబ్బారావు, షేక్‌ కాలేషా తదితరులు పాల్గొన్నారు.

వైద్య వృత్తిని ప్రజాసేవగా భావించాలి

వైద్య వృత్తిని ప్రజాసేవగా భావించి సేవలందించాలని టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ డాక్టర్‌ గొట్టిపాటి లక్ష్మి అన్నారు. శనివారం మండలంలోని చలివేంద్ర కొండ వద్ద నిర్మించనున్న ఆర్‌ఎంపీ, పీఎంపీల సంక్షేమ సంఘం కమ్యూనిటీ హాల్‌కు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వైద్య వృత్తిని వ్యాపారంగా మారకుండా చూడాల్సిన బాధ్యత వైద్యులపై ఉందన్నారు. కార్యక్రమంలో ఆర్‌ఎంపీల అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్షుడు గోవిందరాజు, యూనియన్‌ నాయకులు నాగేశ్వరరావు, కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Oct 11 , 2025 | 10:41 PM