సొంతింటి కల నేరవేర్చడమే ప్రభుత్వ లక్ష్యం
ABN , Publish Date - Nov 12 , 2025 | 11:30 PM
రాష్ట్రంలోని పేదలకు సొంతింటి కల నేరవేర్చడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్రనరసింహారెడ్డి అన్నారు. మండలంలోని వగ్గంపల్లి గ్రామ ఎస్సీపాలెంలో నూతనంగా నిర్మించిన ఇళ్లను బుధవారం ఎమ్మెల్యే ఉగ్ర టీడీపీ శ్రేణులు, అఽధికారులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అందరికీ ఇళ్లు లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందన్నారు.
పామూరు, నవంబరు 12 (ఆంధ్రజ్యోతి) : రాష్ట్రంలోని పేదలకు సొంతింటి కల నేరవేర్చడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్రనరసింహారెడ్డి అన్నారు. మండలంలోని వగ్గంపల్లి గ్రామ ఎస్సీపాలెంలో నూతనంగా నిర్మించిన ఇళ్లను బుధవారం ఎమ్మెల్యే ఉగ్ర టీడీపీ శ్రేణులు, అఽధికారులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అందరికీ ఇళ్లు లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. గత పాలకులు గ్రామాలకు దూరంగా సెంటున్నర ఇంటి స్థలం మంజూరు చేసి నిధులు ఇవ్వకపోవడంతో గృహాల నిర్మాణాలు ప్రారంభం కాలేదని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే బిల్లులు మంజూరు చేసి వారి కలలను సాకారం చేసిందని అన్నారు. తమది మాటల ప్రభుత్వం కాదని, చేతల ప్రభుత్వమని అన్నారు. నియోజకవర్గంలో కూటమి ప్రభుత్వం వచ్చాక 669 గృహాలను పూర్తి చేసిందని వివరించారు. ఈ సందర్భంగా లబ్ధిదారురాలు పూనూరి ఎలిసమ్మ, జాన్‌వర్గీ్‌స దంపతులకు ఇంటి తాళం అందజేసి అభినందించారు. కాగా కాలనీ ప్రజలు తమకు ఇంటి స్థలాలు, వ్యవసాయ భూములు మంజూరు చేయాలని కోరారు. అందుకు స్పందించిన ఉగ్ర సంబంధిత అధికారులతో మాట్లాడి భూములను సర్వేచేసి రిపోర్టు ఇవ్వాలని ఆదేశించారు. ఈ కార్యక్రమాల్లో తహసీల్దార్ ఆర్. వాసుదేవరావు, ఎంపీడీవో ఎల్. బ్రహ్మయ్య, హౌసింగ్ డీఈ కోటిరెడ్డి, ఏఈ సురే్‌షతో పాటు టీడీపీ నాయకులు యారవ శ్రీను, బొల్లా నరసింహారావు, పువ్వాడి వెంకటేశ్వర్లు, బి. జయరామిరెడ్డి, సర్పంచ్ సుబ్బయ్య, టీడీపీ గ్రామ అధ్యక్షుడు బి. వెంకటేశ్వరరెడి తదితరులు పాల్గొన్నారు.
దర్శిలో పక్కా గృహాలకు భూమి పూజ
దర్శి : పేదల అభ్యున్నతే కూటమి ప్రభుత్వ లక్ష్యమని టీడీపీ దర్శి నియోజకవర్గ ఇన్‌చార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి పేర్కొన్నారు. మండలంలోని కొత్తపల్లిలో నూతనంగా నిర్మించే పక్కా గృహాలకు బుధవారం భూమిపూజ చేశారు. మంజూరైన పక్కాగృహాల సర్టిఫికెట్లు లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పేదలకు కనీస మౌలిక సదుపాయాలను తీర్చాలనే సంకల్పంతో ప్రభుత్వం ఈ అద్భుత కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందన్నారు. అన్న ఎన్టీఆర్ పేదలకు కూడు, గుడ్డ, నీడ కల్పించాలనే లక్ష్యంతోనే పనిచేశారని ఆయన ఆశయాలకు అనుగుణంగా తమ ప్రభుత్వం ముందుకు సాగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ దర్శి నియోజకవర్గ నాయకుడు డాక్టర్ కడియాల లలిత్‌సాగర్, ఎంపీడీవో పి. కల్పన, హౌసింగ్ ఏఈ షాకీర్‌బాష, మండల టీడీపీ అధ్యక్షుడు మారెళ్ల వెంకటేశ్వర్లు, మాజీ అధ్యక్షుడు గెర్రె సుబ్బారెడ్డి, నాయకులు గోవిందరెడ్డి, నీటి సంఘం అధ్యక్షుడు వెంకటరామి రెడ్డి, రాచపూడి పేతురు తదితరులు పాల్గొన్నారు.