మహిళల ఆరోగ్యవంతంగా ఉండాలన్నదే ప్రభుత్వ ధ్యేయం
ABN , Publish Date - Sep 26 , 2025 | 11:06 PM
మహిళల ఆరోగ్యవంతంగా జీవించాలన్నదే ప్రభుత్వ ధ్యేయమని మారెళ్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి బీ మధు శంకర్ చెప్పారు.
వైద్యాధికారి బీ మధు శంకర్
ముండ్లమూరు, సెప్టెంబరు 26 (ఆంధ్రజ్యోతి) : మహిళల ఆరోగ్యవంతంగా జీవించాలన్నదే ప్రభుత్వ ధ్యేయమని మారెళ్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి బీ మధు శంకర్ చెప్పారు. ఆయన శుక్రవారం మండలంలోని శంకరాపురంలో స్వస్థ్ నారి సశక్తి పరివార్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సర్పంచ్ కూరపాటి మహేశ్వరి అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమంలో మండల టీడీపీ అధ్యక్షుడు కూరపాటి శ్రీనివాసరావు, నారాయణ స్వామి, రిటైర్డు ఎస్‌ఐ ఆంజనేయులు, హెచ్‌ఎం అరుణ కుమారి, సీహెచ్‌వో పాల్గొన్నారు.
బొద్దికూరపాడులో...
తాళ్లూరు, సెప్టెంబరు 26(ఆంధ్రజ్యోతి) : తూర్పుగంగవరం పీహెచ్‌సీ వైద్యులు శ్రీకాంత్‌రెడ్డిఆధ్వర్యంలో బొద్దికూరపాడు గ్రామంలో స్వస్థ్ నారీ సశక్త్ పరివార్ అభియాన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మందా శ్యాంసన్, ఎంపీటీసీ సభ్యుడు బాలకోటయ్య, ఉపసర్పంచ్ పులి ప్రసాద్‌రెడ్డి, పోలంరెడ్డి రమణారెడ్డి, హెచ్‌ఎ్‌సవో చంద్రశేఖర్, పీహెచ్‌ఎన్ రమణమ్మ, హెచ్‌సీ సుశీల పాల్గొన్నారు.
పామూరులో...
పామూరు, సెస్టెంబరు 26 (ఆంధ్రజ్యోతి) : కుటుంబంలో మహిళా సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటేనే అందరికీ సురక్షితమని టీడీపీ నాయకులు యారవ శ్రీనివాసులు చెప్పారు. ఎర్రచేలు, ప్రభుత్వ పాఠశాలలో స్వస్థ్ నారీ - సశక్త్ పరివార్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. సర్పంచ్ సుబ్బయ్య, టీడీపీ నాయకులు జయరామిరెడ్డి, నాగశేషు, సూపర్‌వైజర్ ఎంవీఎస్ పార్వతి పాల్గొన్నారు.