Share News

ఉపాధి కల్పనే ప్రభుత్వ ధ్యేయం

ABN , Publish Date - Nov 10 , 2025 | 11:40 PM

రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాల కల్పనే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి గూడూరి ఎరిక్షన్‌బాబు చెప్పారు. సోమవారం మండలంలోని గంగాపాలెం సమీపంలో ఎంఎ్‌సఎంఈ(చిన్న, మధ్యతరహా సంస్థలు) పార్క్‌ స్థలాన్ని మార్కాపురం ఇన్‌చార్జి సబ్‌ కలెక్టర్‌ శివరామిరెడ్డితో కలిసి ఎరిక్షన్‌బాబు పరిశీలించారు.

ఉపాధి కల్పనే ప్రభుత్వ ధ్యేయం
గంగాపాలెంలో స్థలాన్ని పరిశీలిస్తున్న ఇన్‌చార్జి ఎరిక్షన్‌ బాబు

గంగాపాలెంలో ఎంఎ్‌సఎంఈ పార్క్‌ స్థలాన్ని పరిశీలించిన టీడీపీ ఇన్‌చార్జి ఎరిక్షన్‌బాబు

నేడు సీఎం చంద్రబాబు వర్చువల్‌గా శంకుస్థాపన

ఎర్రగొండపాలెం రూరల్‌, నవంబరు 10 (ఆంధ్రజ్యోతి) : రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాల కల్పనే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి గూడూరి ఎరిక్షన్‌బాబు చెప్పారు. సోమవారం మండలంలోని గంగాపాలెం సమీపంలో ఎంఎ్‌సఎంఈ(చిన్న, మధ్యతరహా సంస్థలు) పార్క్‌ స్థలాన్ని మార్కాపురం ఇన్‌చార్జి సబ్‌ కలెక్టర్‌ శివరామిరెడ్డితో కలిసి ఎరిక్షన్‌బాబు పరిశీలించారు. అనంతరం ఎరిక్షన్‌బాబు మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు మంగళవారం జిల్లాలోని పీసీపల్లి మండలంలోని లింగన్నపాలెంలో ఎంఎ్‌సఎంఈ పార్క్‌ను ప్రారంభిస్తారని తెలిపారు. ఈక్రమంలోనే గంగాపాలెంలోని సర్వే నెంబరు 258, 259, 260లో సుమారు 40.39 ఎకరాల్లో ఏర్పాటు చేస్తున్న పార్క్‌ను కూడా వర్చువల్‌గా సీఎం ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. ఈ పార్కు ద్వారా పరిశ్రమలు, పెట్టుబడులు, యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. వెనుకబడిన ఈ ప్రాంతంలో ఏర్పాటు చేయడంపై సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మార్కెట్‌ యార్డ్‌ చైర్మన్‌ చేకూరి సుబ్బారావు, తహసీల్దార్‌ మంజునాథరెడ్డి, ఎంపీడీవో బండారు శ్రీనివాసులు, టీడీపీ మండల అధ్యక్షుడు చిట్యాల వెంగళ్‌రెడి, విద్యుత్‌ శాఖ ఏఈ కిషోర్‌, ఎంసీహెచ్‌ మంత్రునాయక్‌, కంచర్ల సత్యనారాయణ గౌడ్‌, చలమయ్య, నాయకులు పాల్గొన్నారు.

Updated Date - Nov 10 , 2025 | 11:40 PM