విద్యార్థుల సమగ్రాభివృద్ధే ప్రభుత్వ ధ్యేయం
ABN , Publish Date - Dec 05 , 2025 | 11:20 PM
విద్యార్థినీవిద్యార్థుల సమగ్రాభివృద్ధిని లక్ష్యంగా పెట్టుకుని ప్రభుత్వం విద్యారంగంలో ఎన్నో సంస్కరణలను అమలు చేస్తోందని కనిగిరి శాసనసభ్యుడు డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి అన్నారు.స్థానిక జెడ్పీ ఉన్నత పాఠశాలలో శుక్రవారం జరిగిన మెగా పేరెంట్స్‌డే సమావేశంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు.
పీసీపల్లి,డిసెంబరు5(ఆంధ్రజ్యోతి):విద్యార్థినీవిద్యార్థుల సమగ్రాభివృద్ధిని లక్ష్యంగా పెట్టుకుని ప్రభుత్వం విద్యారంగంలో ఎన్నో సంస్కరణలను అమలు చేస్తోందని కనిగిరి శాసనసభ్యుడు డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి అన్నారు.స్థానిక జెడ్పీ ఉన్నత పాఠశాలలో శుక్రవారం జరిగిన మెగా పేరెంట్స్‌డే సమావేశంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. విద్యార్థుల భవిష్యత్తు కోసం పాఠశాలలో మౌలిక సదుపాయాల అభివృద్ధి, డిజిటల్ లెర్నింగ్, నైపుణ్యాల అభివృద్ధి వంటి కార్యక్రమాలను ప్రభుత్వ పాఠశాలల్లో ఏర్పాటు చేసిందన్నారు. విద్యాభివృద్ధిలో భాగంగా విద్యార్థినీ విద్యార్థుల భవిష్యత్తును మెరుగుపరిచేందుకు విద్యాశాఖమంత్రి నారా లోకేష్ సరికొత్త మార్పులు తీసుకొచ్చారని ఆయన అన్నారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు మెరుగైన ఫలితాలు ఇస్తాయని ఆయన అన్నారు.అనంతరం ఎంఈవో ఆర్.శ్రీనివాసులు ఉచితంగా అందజేసిన స్టడీ మెటీరియల్స్‌ను 10వ తరగతి విద్యార్థులకు ఆయన పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో డ్వామా పీడీ జోస్‌ఫకుమార్, తహసీల్దార్ సీహెచ్.ఉష, ఎంపీడీవో కృష్ణారావు, ఎంఈవోలు జి.సంజీవి, ఆర్.శ్రీనివాసులు, హెచ్‌ఎం సుబ్బరామయ్య, ఎస్‌ఎంసీ చైర్మన్ మల్లేశ్వరి, ఎస్సై జి.కోటయ్య తదితరులు ఉన్నారు.
విద్యార్థులకు స్టడీచైర్స్ పంపిణీ
పీసీపల్లి గ్రామానికి చెందిన వ్యాపారవేత్త గోగడ శ్రీనివాసులు స్థానిక జడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థినీ విద్యార్థులకు 100 స్టడీ చైర్స్, ప్యాడ్‌లను శుక్రవారం పాఠశాలలో జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి ద్వారా అందజేశారు. ఈ సందర్భంగా గోగడ శ్రీనివాసులును ఎమ్మెల్యే ఉగ్ర అభినందించారు.అనంతరం ఉగ్రను శ్రీనివాసులు శాలువాతో సత్కరించారు.