Share News

మహిళల ఆర్థికాభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం

ABN , Publish Date - Dec 30 , 2025 | 11:45 PM

మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి అన్నారు. మంగళవారం స్థానిక విశ్వనాథపురం జూనియర్‌ కాలేజీ దగ్గర వెలుగు డీఆర్‌డీఏ, సెర్ప్‌ ఆధ్వర్యంలో డ్వాక్రా మహిళలకు మంజూరు చేసిన అరకు కాఫీ కేఫ్‌ను ఆయన ప్రారంభించారు.

మహిళల ఆర్థికాభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం
అరకు కాఫీ షా్‌పను ప్రారంభించిన ఎమ్మెల్యే కందుల, వెలుగు పీడీ నారాయణ

ఎమ్మెల్యే కందుల

పొదిలి, డిసెంబరు 30 (ఆంధ్రజ్యోతి) : మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి అన్నారు. మంగళవారం స్థానిక విశ్వనాథపురం జూనియర్‌ కాలేజీ దగ్గర వెలుగు డీఆర్‌డీఏ, సెర్ప్‌ ఆధ్వర్యంలో డ్వాక్రా మహిళలకు మంజూరు చేసిన అరకు కాఫీ కేఫ్‌ను ఆయన ప్రారంభించారు. పీఎంఎ్‌ఫఎం స్కీం ద్వారా డ్వాక్రా మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నట్లు తెలిపారు. పొదుపు సంఘాల బలోపేతానికి అనేక పథకాలను అమలు చేస్తున్నట్లు చెప్పారు. మహిళలు అన్నిరంగాల్లో ఎదగాలన్న సదుద్దేశంతో నాడు చంద్రబాబు మదిలో ఆలోచన నేడు డ్వాక్రా గ్రూపులు రాష్ట్రానికే ఆదర్శంగా నిలిచాయని కందుల గుర్తు చేశారు. వెలుగు పీడీ నారాయణ మాట్లాడుతూ బండి ప్రసన్న గ్రూపు సభ్యురాలికి పొదిలి కెనరాబ్యాంక్‌ రూ.6లక్షల 60వేలతో పీఎంఎ్‌ఫఎం స్కీం క్రింద అరకు కాఫీ షాప్‌ను మంజూరు చేసిందన్నారు. ఇలా అనేక రకాలుగా మహిళలకు జీవనోపాధి కల్పిస్తున్నట్లు ఆయన వివరించారు. కార్యక్రమంలో ఏపీడీ నీలకంఠారెడ్డి, డీపీఎం దానం, ఎస్‌వీఈపీ ఏపీఎం సుబ్బారావు, పొదిలి ఏపీఎం గోపాలక్రిష్ణ, టీడీపీ మండల అధ్యక్షుడు దోర్నాల అంజిరెడ్డి, ఏఎంసీ చైర్మన్‌ ఇమాంసాహెబ్‌, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి గునుపూడి భాస్కర్‌, క్లస్టర్‌ ఇన్‌చార్జి ఆవులూరి యలమంద, పట్టణ అధ్యక్షుడు ముల్లా ఖుద్దూస్‌ పాల్గొన్నారు.

పథకాలను వినియోగించుకోవాలి

కొనకనమిట్ల : ప్రభుత్వం డ్వాక్రా సం ఘాల మహిళలకు అనేక ఉపాధి అవకాశాలను కల్పించిందని సద్వినియోగం చేసుకోవాలని మంగళవారం ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌ టి.నారాయణ అన్నారు. మండలంలోని చినమనగుండం గ్రామంలో గుం టూరి జ్యోతి అనే డ్వాక్రా సభ్యురాలికి పీఎంఈజీపీ కింద కౌ యూనిట్‌ను మంజూరు కాగా ఆయన ప్రారంభించారు. కార్యక్రమంలో ఏపీడీ నీలకంఠారెడ్డి, ఎల్‌హెచ్‌డీపీఎం రజనీకాంత్‌, ఏపీ ఎం సుధాకర్‌, కెనరా బ్యాంక్‌ మేనేజర్‌ రమేష్‌, గ్రామస్థులు పాల్గొన్నారు.

Updated Date - Dec 30 , 2025 | 11:45 PM