Share News

రైతుల ఆర్థికాభివృద్ధే ప్రభుత్వ ధ్యేయం

ABN , Publish Date - Dec 29 , 2025 | 11:44 PM

రైతులు ఆర్థికంగా అభివృద్ధి చెం దాలన్న ఉద్దేశంతోనే ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి అన్నా రు. మండలంలోని గానుగపెంట, పోతలపాడులో రైతన్నా మీకోసం కార్యక్రమం నిర్వహించారు.

రైతుల ఆర్థికాభివృద్ధే ప్రభుత్వ ధ్యేయం
రైతులనుద్దేశించి మాట్లాడుతున్న ఎమ్మెల్యే కందుల

ఎమ్మెల్యే కందుల

తర్లుపాడు, డిసెంబరు 29 (ఆంధ్రజోతి) : రైతులు ఆర్థికంగా అభివృద్ధి చెం దాలన్న ఉద్దేశంతోనే ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి అన్నా రు. మండలంలోని గానుగపెంట, పోతలపాడులో రైతన్నా మీకోసం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే కందుల మాట్లాడుతూ రైతులు పూర్వీకులు అనుసరించిన సాగు పద్ధతులను తిరిగి పాటిస్తే ప్రజలు ఆరోగ్యంగా ఉంటారన్నారు. ప్రతి పంటకూ గిట్టుబాటు ధర కల్పించేందుకు రైతు సేవా కేంద్రాల్లో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. వచ్చే ఏడాది వెలిగొండ ప్రాజె క్టు పూర్తి అయితే ప్రతి ఎకరాకు సాగునీరు అందుతుందన్నారు. రైతులకు ప్రభుత్వం టెక్నాలజీ పరిస్థితిని కల్పిందిందన్నారు. రైతులు బాగుపడాలంటే ఫుడ్‌ ప్రాసెసింగ్‌ విఽధానాలను అలవర్చుకోవాలని, ప్రభుత్వం రూ.13వేల కోట్లతో 38 ఫుడ్‌ ప్రాసెసింగ్‌ పరిశ్రమలను ఏర్పాటు చేసిందన్నారు. గత వైసీపీ పాలకులు జిల్లాలను విభజించినప్పుడు పశ్చిమ ప్రకాశంలోని మార్కాపురానికి అన్యాయం చేశారన్నారు. అప్పట్లో జిల్లా ఇవ్వాలని నేను దీక్ష చేసినపుప్పడు పోలీసులతో అక్రమ కేసులు పెట్టించారని కందుల గుర్తు చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన మాట ప్రకారం మార్కాపురాన్ని జిల్లాగా ప్రకటించారన్నారు. నూతన జిల్లా ఏర్పాటుతో పశ్చిమ ప్రాంత అభివృద్ధి, పరిశ్రమల ఏర్పాటు, యువతకు ఉద్యోగి, ఉపాధి కల్పన మెరుగుపడుతుందన్నారు. వెలిగొండ నీళ్లొస్తే ఈ ప్రాంతం సస్యశ్యామలంగా మారుతుందని ఎమ్మెల్యే కందుల తెలిపారు. అనంతరం రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పోతలపాడు గ్రామంలో రూ.15లక్షలతో నూతనంగా నిర్మించిన సీసీ రోడ్డును ఎమ్మెల్యే ప్రారంభించారు. మినీ గోకులం షెడ్‌లను కూడా ప్రారంభించారు. మార్కాపురం జిల్లాగా ప్రక టించిన ముఖ్యమంత్రి చంద్రబాబు చిత్రపటానికి మహిళలు పాలాభిషేకం చేశా రు. కార్యక్రమంలో ఎంపీడీవో ఓ.అన్నమ్మ, ఏడీఏ బాలాజీ నాయక్‌, వ్యవసాయ అధికారిణి జోష్నదేవి, మండల పార్టీ అధ్యక్షులు ఉడుముల చిన్నపరెడ్డి, కంచర్ల కాశయ్య, పుచ్చనూతల గోపీనాథ్‌ చౌదరి, చలమయ్య, కాశీం, మేకల వెంకట్‌, లక్ష్మ య్య, రావి బాసపతిరెడ్డి, ఏసుదాసు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ఎంఎ్‌సఎంఈ ఇండస్ట్రియల్‌ పార్క్‌ పనుల పరిశీలన

మండలంలోని మేకలవారిపల్లె టోల్‌ ప్లాజా వద్ద ఎంఎ్‌సఎంఈ ఇండస్ట్రియల్‌ పార్క్‌ పనులను ఎమ్మెల్యే కందుల సోమావారం పరిశీలించారు. ఈ సందర్భంగా పనులు వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. ఏఎంసీ చైర్మన్‌ మాలపాటి వెంకటరెడ్డి, నాయకులు, అధికారులు పాల్గొన్నారు.

వైసీపీ నాయకుల మాటలు నమ్మొద్దు

కొనకనమిట్ల : ఐదేళ్ల పాలనలో అభివృద్ధి చేతగాని వైసీపీ నాయకులు ప్రజా ప్రభుత్వంపై ఆడుతున్న అబద్ధపు మాటలను నొమ్మొద్దని ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి అన్నారు. మండలంలోని గార్లదిన్నె గ్రామంలో సోమవారం జరిగిన రైతన్నా మీకోసం కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. అనంతరం గార్లెదిన్నె మహిళలు, రైతులు మార్కాపురం జిల్లాగా ప్రకటించిన చంద్రబాబునాయుడు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈకార్యక్రమంలో మండల టీడీపీ అధ్యక్షులు మోరబోయిన బాబురావు, పొదిలి మార్కెట్‌యార్డు ఛైర్మన్‌ డాక్టర్‌ ఇమాంమ్‌సా, చినారికట్ల సొసైటీ అధ్యక్షులు సానికొమ్ము వెంకటేశ్వరెడ్డి, మండలపార్టీ మాజీ అధ్యక్షులు తాతిరెడ్డి వెంకటేశ్వరెడ్డి, గొట్లగట్టు సర్పంచ్‌ పెరికే సుఖ్‌దేవ్‌, టీడీపీ నాయకులు మువ్వా కాటంరాజు, పరిటాల సుబ్బయ్య, ఉడుముల లక్ష్మిరెడ్డి బికేపాడు గ్రామ టీడీపీ అధ్యక్షుడు తిరుపతరెడ్డి, బషపతినాయుడు, పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

వైసీపీని వీడి టీడీపీలోకి 50 కుటుంబాలు చేరిక

కొనకనమిట్ల : మండలంలోని గార్లదిన్నె గ్రామంలో సోమవారం ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి సమక్షంలో 50 కుటుంబాల వారు వైసీపీని వీడి సోమవారం టీడీపీలో చేరారు. ఈసందర్బంగా వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు పాలనా దక్షిత, నియోజకవర్గంలో ఎమ్మెల్యే కందుల చేస్తున్న అభివృద్ధిని చూసి వైసీపీని వీడినట్లు చెప్పారు. గార్లదిన్నె నుంచి 30, వెలిగండ్ల నుంచి 20 కుటుంబాలు వైసీపీకి గుడ్‌బై చెప్పి టీడీపీలో చేరినట్లు చెప్పారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కందుల చేరినవారికి పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు.

Updated Date - Dec 29 , 2025 | 11:44 PM