Share News

రైతుల ఆర్థికాభివృద్ధే ప్రభుత్వ ధ్యేయం

ABN , Publish Date - Dec 21 , 2025 | 10:25 PM

రైతుల ఆర్థిక అభివృద్ధే ప్రజా ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి అన్నారు. మండలంలోని తాడివారిపల్లిలో రైతన్నా మీకోసం కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కందుల మాట్లాడుతూ పశ్చిమ ప్రాంత ప్రజల చిరకాల కోర్కె అయిన మార్కాపురం జిల్లాను ప్రకటించి ముఖ్యమంత్రి చంద్రబాబు మాట నిలబెట్టుకున్నారన్నారు.

రైతుల ఆర్థికాభివృద్ధే ప్రభుత్వ ధ్యేయం
జనసేన పార్టీ జెండా ఆవిష్కరణ సభలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే కందుల

ఎమ్మెల్యే కందుల

తర్లుపాడు, డిసెంబరు 21 (ఆంధ్రజోతి) : రైతుల ఆర్థిక అభివృద్ధే ప్రజా ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి అన్నారు. మండలంలోని తాడివారిపల్లిలో రైతన్నా మీకోసం కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కందుల మాట్లాడుతూ పశ్చిమ ప్రాంత ప్రజల చిరకాల కోర్కె అయిన మార్కాపురం జిల్లాను ప్రకటించి ముఖ్యమంత్రి చంద్రబాబు మాట నిలబెట్టుకున్నారన్నారు. ఆయనకు మనమంతా రుణపడి ఉంటామన్నారు. మార్కాపురం జిల్లా కోసం గతంలో తాను దీక్ష చేస్తే వైసీపీ పాలకులు అక్రమ కేసులు బనాయించారన్నారు. వచ్చే ఏడాది వెలిగొండను పూర్తి చేసి ఈ ప్రాంత ప్రజలు, రైతులకు నీటి కష్టాలు తీరుస్తామన్నారు. రైతులనుద్దేశించి ఎమ్మెల్యే మాట్లాడుతూ రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గించి సేంద్రియ ఎరువులను వాడితే అధిక పంట దిగుబడులు సాధించి లాభపడతారని సూచించారు. 175 నియోజకవర్గాల్లో ఫుడ్‌ ప్రాసెసింగ్‌ పరిశ్రమలను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. అనంతరం మార్కాపురం జిల్లాగా ప్రకటించినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు చిత్రపటానికి మహిళలు, కూటమి నాయకలు పాలాభిషేకం చేశారు. కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు ఉడుముల చిన్నపరెడ్డి, ఏఎంసీ చైర్మన్‌ మాలపాటి వెంకటరెడ్డి, పుచ్చనూతల గోపీనాథ్‌ చౌదరి, కంచర్ల కాశయ్య, రొడ్డ గురవయ్య, కందుల చిట్టిబాబు, వేశపోగు జాన్‌, పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

రైతన్నలకు అండగా

మార్కాపురం రూరల్‌ : రైతన్నలకు ప్రభుత్వం అండగా ఉంటుందని ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి తెలిపారు. మండలంలోని రామచంద్రాపురం గ్రామంలో రైతన్నా మీకోసం కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం సీఎం చంద్రబాబు చిత్రపటానికి మహిళలు పాలాభిషేకం చేశారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు వెంకటరెడ్డి, రామాంజులరెడ్డి, శ్రీనివాసులు, రైతులు పాల్గొన్నారు.

కూటమి బంధాన్ని ఎవరూ విడదీయలేరు

కూటమి ప్రభుత్వ బంధాన్ని ఎవరూ విడదీయలేరని ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి అన్నారు. మండలంలోని రాయవరం గ్రామంలో బ్రిడ్జి వద్ద జనసేన పార్టీ నాయకులు ఏర్పాటు చేసిన పార్టీ జెం డాను ఎమ్మెల్యే కందుల, జనసేన పార్టీ ఇన్‌చార్జి కాశీనాథ్‌తో కలిసి ఆదివా రం రాత్రి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌ రాష్ట్రాభివృద్ధికి కృషి చేస్తున్నారని వారికి అండగా ప్రజలు నిలబడాలని కోరారు. వైసీపీ అబద్ధాలను నమ్మొద్దని అన్నారు. కార్యక్రమంలో జనసేన, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Updated Date - Dec 21 , 2025 | 10:26 PM