గ్రామాల అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం
ABN , Publish Date - Oct 09 , 2025 | 10:28 PM
గ్రామాల అభివృద్ధే లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తోందని టీడీపీ ఇన్‌చార్జి గూడూరి ఎరిక్షన్‌బాబు పేర్కొన్నారు. మండలంలోని కటకానిపల్లె గ్రామంలో తాగునీటి పథకాన్ని ఎరిక్షన్‌బాబు గురువారం ప్రారంభించారు.
తాగునీటి పథకాన్ని ప్రారంభించిన ఎరిక్షన్‌బాబు
పెద్ద దోర్నాల, అక్టోబరు 9 (ఆంధ్రజ్యోతి) : గ్రామాల అభివృద్ధే లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తోందని టీడీపీ ఇన్‌చార్జి గూడూరి ఎరిక్షన్‌బాబు పేర్కొన్నారు. మండలంలోని కటకానిపల్లె గ్రామంలో తాగునీటి పథకాన్ని ఎరిక్షన్‌బాబు గురువారం ప్రారంభించారు. గ్రామంలో తాగునీటి సమస్యను పరిష్కరించే క్రమంలో నూతనంగా బోరు వేయించి మోటార్‌ను ఏర్పాటు చేశారు. ప్రారంభించేందుకు వచ్చిన ఎరిక్షన్‌బాబుకు ప్రజలు ఘనంగా స్వాగతం పలికారు. చాన్నాళ్లుగా పడుతున్న నీటి ఇబ్బందులు తీర్చినందుకు ప్రజలు ఆయనకి కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం ఎరిక్షన్‌బాబు మాట్లాడుతూ ప్రజా సమస్యలను పరిష్కరించి వారిలో ఆనందాన్ని చూడాలన్నదే ప్రజా ప్రభుత్వ లక్ష్యమన్నారు. కార్యక్రమంలో మండల అధ్యక్షుడు షేక్ మహబూబ్ బాషా, టీడీపీ నాయకులు దొడ్డా శేషాద్రి, ఈదర మల్లయ్య, చంటి, కె సుబ్బారెడ్డి, ఎలకపాటి చంచయ్య, యోహాను,రావెళ్ల సత్యనారాయణ పాల్గొన్నారు.