Share News

పేదల అభివృద్ధే ప్రభుత్వ ధ్యేయం

ABN , Publish Date - Jul 04 , 2025 | 11:11 PM

పేదల అభివృద్ధే కూటమి ప్రభుత్వ ధ్యేయమని మాజీ ఎమ్మెల్యే నారపుశెట్టి పాపారావు అన్నారు. మండలంలోని బట్టువారిపల్లిలో శుక్రవారం సాయంత్రం సుపరి పాలనలో తొలిఅడుగు కార్యక్రమం నిర్వహించారు.

పేదల అభివృద్ధే ప్రభుత్వ ధ్యేయం
బట్టువారిపల్లిలో కరపత్రాలు పంపిణీ చేస్తున్న మాజీ ఎమ్మెల్యే పాపారావు, పాల్గొన్న టీడీపీ నాయకులు

మాజీ ఎమ్మెల్యే నారపుశెట్టి పాపారావు

దర్శి, జూలై 4(ఆంధ్రజ్యోతి): పేదల అభివృద్ధే కూటమి ప్రభుత్వ ధ్యేయమని మాజీ ఎమ్మెల్యే నారపుశెట్టి పాపారావు అన్నారు. మండలంలోని బట్టువారిపల్లిలో శుక్రవారం సాయంత్రం సుపరి పాలనలో తొలిఅడుగు కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్భంగా టీడీపీ నాయకులు ఇంటింటికి తిరిగి ప్రభుత్వం అమలుచేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్ర మాల కరపత్రాలు అందజేశారు. పథకాలు అందుతున్న తీరును, సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈసందర్భంగా పాపారావు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అన్నివర్గాల ప్రజలు ప్రశాత జీవనం సాగిస్తున్నారన్నారు. గత వైసీపీ పాలకుల కక్షసాధింపు, అవినీతి, అక్రమ పాల నతో ప్రజలు ఎంతో ఇబ్బందులు పడ్డారని విమర్శిం చారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా సీఎం చంద్ర బాబు, డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌ ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం పేద ప్రజల అభ్యున్నతి, రాష్ర్టాభివృద్ధే ధ్యేయం గా పనిచేస్తుందన్నారు. ఏడాదికా లంలో ప్రభుత్వం పనితీరును గు రించి ప్రజల స్పందన తెలుసుకు నేందుకే ఈకార్యక్రమంలో భాగం గా ఇంటింటికి తిరిగి ప్రజలతో మమేకమవుతున్నట్లు వివ రించా రు. కార్యక్రమంలో టీడీపీ మండ ల అధ్యక్షుడు మారెళ్ళ వెంకటేశ్వ ర్లు, పట్టణ అధ్యక్షుడు పుల్లలచె రువు చిన్నా, దారం సుబ్బారావు, నానబాల అంకయ్య, రూపినేని రామారావు, తిరుపతిరావు, పులి మి యల్లయ్య, సానె సుబ్బయ్య, జూపల్లి కోటేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jul 04 , 2025 | 11:11 PM