ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం
ABN , Publish Date - Dec 13 , 2025 | 10:50 PM
ప్రజల సంక్షేమం, అభివృద్ధే ప్రభుత్వ ధ్యేయమని టీడీపీ ఇన్‌చార్జి గూడూరి ఎరిక్షన్‌బాబు అన్నారు. ఎర్రగొండపాలెం ఎన్జీవో కాలనీలో శనివారం రూ.26లక్షలతో సీసీ రోడ్డు నిర్మాణ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ని యోజకవర్గంలో ఇప్పటికే రూ.10కోట్లతో సీసీ రోడ్లు నిర్మాణ పనులు పూర్తయ్యాయని అన్నారు.
టీడీపీ ఇన్‌చార్జి ఎరిక్షన్‌బాబు
వైపాలెంలో రూ.26లక్షలతో
సీసీ రోడ్డుకు శంకుస్థాపన
ఎర్రగొండపాలెం, డిసెంబరు 13 (ఆం ధ్రజ్యోతి) : ప్రజల సంక్షేమం, అభివృద్ధే ప్రభుత్వ ధ్యేయమని టీడీపీ ఇన్‌చార్జి గూడూరి ఎరిక్షన్‌బాబు అన్నారు. ఎర్రగొండపాలెం ఎన్జీవో కాలనీలో శనివారం రూ.26లక్షలతో సీసీ రోడ్డు నిర్మాణ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ని యోజకవర్గంలో ఇప్పటికే రూ.10కోట్లతో సీసీ రోడ్లు నిర్మాణ పనులు పూర్తయ్యాయని అన్నారు. జాతీయ రహదారి నుం చి గ్రామాలకు సైతం అనుసంధానం చేస్తూ కేంద్ర ప్రభుత్వం సాస్కీ నిధులు రూ.10.64కోట్లు మంజూరు చేసిందని అన్నారు. నియోజకవర్గంలో రూ.5కోట్లతో రెండో విడత సీసీ రోడ్లకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపామన్నారు. ఐదేళ్లూ ఎలాంటి అభివృద్ధిని చేయకుండానే వైసీ పీ నాయకులు పనికట్టుకొని ప్రజా ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని అన్నారు. కార్యక్రమంలో టీడీపీ మండలాధ్యక్షుడు చిట్యాల వెంగళరెడ్డి, టీడీపీ ముఖ్యనాయకులు వేగినాటి శ్రీను, కామేపల్లి వెంకటేశ్వరు, కంచర్ల సత్యనారాయణగౌడ్, సీనియర్ నాయకులు శనగా నారాయణరెడ్డి, పేరం రమణారెడ్డి, పట్టణాధ్యక్షుడు పీ మల్లికార్జునరావు పాల్గొన్నారు.
ప్రతి అర్జీనీ పరిష్కరిస్తాం
ప్రజాదర్బార్‌లో వచ్చిన ప్రతి అర్జీనీ పరిష్కరిస్తామని ఎరిక్షన్‌బాబు అన్నారు. శనివారం టీడీపీ కార్యాలయంలో ప్రజాదర్బార్ కార్యక్రమాన్ని ఆయన నిర్వహించారు. ప్రజల నుంచి అందుకున్న అర్జీలను పరిష్కరించాలని అధికారులకు సూచించారు. కొన్ని సమస్యలను అక్కడిక్కడే పరిష్కరించారు.
అనంతరం ఆయన టీడీపీ సీనియర్ నాయకుడు కామేపల్లి వెకంటేశ్వర్లు భార్య పద్మావతి అనారోగ్యంతో ఉండగా ఎరిక్షన్‌బాబు పరామర్శించారు.