ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ఽధ్యేయం
ABN , Publish Date - Sep 01 , 2025 | 11:00 PM
ప్రజా సంక్షేమమే ప్రభు త్వ ధ్యేయమని మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి అన్నారు. మండలంలోని తహసీల్దార్ కార్యాలయ ఆవరణలో సోమవారం నిర్వహించిన రెవెన్యూ సదుస్సులో ఆయన మాట్లాడారు.
ఎమ్మెల్యే కందుల
కొనకనమిట్ల, సెప్టంబరు 1 (ఆంధ్రజ్యోతి) : ప్రజా సంక్షేమమే ప్రభు త్వ ధ్యేయమని మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి అన్నారు. మండలంలోని తహసీల్దార్ కార్యాలయ ఆవరణలో సోమవారం నిర్వహించిన రెవెన్యూ సదుస్సులో ఆయన మాట్లాడారు. రైతులు పాసుపుస్తకాలు, ఆన్‌లైన్‌వంటి తదితర సమస్యలపై సతమతమౌతున్నారని, త్వరితగతిన భూసమస్యలను పరిష్కరించాలని ఉద్దేశంతోనే రెవె న్యూ సదస్సులను నిర్వహిస్తున్నామన్నారు. మండలంలోని పలు గ్రామాల నుంచి వచ్చిన రైతులు నుంచి స్వయంగా ఎమ్మెల్యే అర్జీలను స్వికరించి అధికారులతో మాట్లాడారు. అర్జీలు త్వరితగతిన పరిష్కారం చూపాలని సూచించారు. మొత్తం 50 అర్జీలు అందినట్లు చెప్పారు. కార్యక్రమంలో కనిగిరి ఆర్డీవో కేశవర్ధన్‌రెడ్డి, తహసీల్దార్ సురేష్, పలువురు వీఆర్‌వోలు, సర్వేయర్లు, పలువురు రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.
బుడ్డపల్లెను ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతాం
తర్లుపాడు : కేతగుడిపి పంచాయతీ బుడ్డపల్లెను ఆదర్శ పంచాయతీగా తీర్చిదిద్దనున్నట్లు ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి అన్నారు. గ్రామంలో రూ.2.93కోట్లతో అన్ని మౌలిక వసతులు కల్పించనున్నట్లు పేర్కొన్నారు. గ్రామంలో సీసీ డ్రైనేజీకి ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మండలంలో ఒక్కో గ్రామాన్ని అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు. గ్రామీణ అభివృద్ధే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. పలు సమస్యలను గ్రామస్థులు ఆయన దృష్టికి తీసుకొచ్చారు. ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించి పరిష్కారానికి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు ఉడుముల చిన్నపురెడ్డి, క్లస్టర్ ఇన్‌ఛార్జ్ పి.గోపినాత్ చౌదరి, నాయకులు ఎన్.కాశయ్య, శ్రీను, పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.