Share News

రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం

ABN , Publish Date - Aug 17 , 2025 | 12:01 AM

రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ డాక్టర్‌ గొట్టిపాటి లక్ష్మి అన్నారు. శనివారం రైతు రథం విజయోత్స వ ర్యాలీని మండలంలోని పులిపాడు శివాల యం వద్ద ప్రారంభించారు. స్వయంగా డాక్ట ర్‌ లక్ష్మి ట్రాక్టర్‌ నడుపుకుంటూ ర్యాలీని ముం దుకు సాగించారు.

రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం
పులిపాడులో రైతు రథం ర్యాలీని ట్రాక్టర్‌ నడిపి ప్రారంభిస్తున్న డాక్టర్‌ గొట్టిపాటి లక్ష్మి

టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ డాక్టర్‌ గొట్టిపాటి లక్ష్మి

ముండ్లమూరు, ఆగస్టు 16(ఆంధ్రజ్యోతి): రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ డాక్టర్‌ గొట్టిపాటి లక్ష్మి అన్నారు. శనివారం రైతు రథం విజయోత్స వ ర్యాలీని మండలంలోని పులిపాడు శివాల యం వద్ద ప్రారంభించారు. స్వయంగా డాక్ట ర్‌ లక్ష్మి ట్రాక్టర్‌ నడుపుకుంటూ ర్యాలీని ముం దుకు సాగించారు. ఈర్యాలీ దర్శి వరకు సా గింది. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ హామీలు నిలబెట్టుకున్న ఘనత కూటమి ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి చంద్రబాబుకే ద క్కిందన్నారు. ఒకవైపు అభివృద్ధి, మరోవైపు సంక్షేమ ప థకాలు పేదలకు అందిస్తున్నారన్నారు. ఐదు మండలా ల నుంచి వచ్చిన టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఆమె వెంట భారీ ర్యాలీగా ముందుకు సాగారు. కార్యక్రమంలో నాయకులు డాక్టర్‌ కడియా ల లలిత్‌సాగర్‌, మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి, నారపుశెట్టి పాపారావు, దారం నాగవేణి సుబ్బారావు, నారపశెట్టి పిచ్చయ్య, తదితరులు పాల్గొన్నారు.

ట్రాక్టర్ల ర్యాలీ సక్సెస్‌

దర్శి, ఆగస్టు 16(ఆంధ్రజ్యోతి): అన్నదాత సుఖీభవ పథకం రైతులకు అందించిన నేపథ్యంలో కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతగా నిర్వహించిన రైతుల ట్రాక్టర్ల ర్యాలీ సూపర్‌ సక్సెస్‌ అయింది. దర్శి మండలం, తూ ర్పువీరాయపాలెం గ్రామంలో ఈనెల 2న సీఎం చంద్ర బాబు అన్నదాత సుఖీభవ పథకాన్ని ప్రారంభించి రైతుల అకౌంట్లలో డబ్బులు జమ చేసిన విషయం తెలిసిందే. ఈనేపథ్యంలో టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ డాక్టర్‌ గొట్టిపాటి లక్ష్మి ఆధ్వర్యంలో ట్రాక్టర్ల ర్యాలీ, రైతు పండుగ సదస్సు శనివారం నిర్వహించారు. ముండ్ల మూరు మండలం పులిపాడు నుంచి ట్రాక్టర్లతో ర్యాలీ ప్రారంభించారు. నియోజకవర్గం నలుమూలల నుండి సుమారు 300 ట్రాక్టర్లతో రైతులు ర్యాలీలో పాల్గొన్నారు. డాక్టర్‌ గొట్టిపాటి లక్ష్మి, డాక్టర్‌ లలిత్‌సాగర్‌ దంప తులు స్వయంగా ట్రాక్టర్‌ నడిపారు. మాజీ ఎమ్మె ల్యే నారపుశెట్టి పాపారా వు, రాష్ట్ర వ్యవసాయ మి షన్‌ వైస్‌చైర్మన్‌ మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి, నియోజక వర్గంలోని నాయకులు, కార్యకర్తలు ఈ ర్యాలీలో పాల్గొన్నారు. పులిపాడు నుంచి దర్శి బస్టాండ్‌కు ర్యాలీ చేరుకొన్న అనంత రం గడియార స్తంభం సెంటర్‌లో ఎన్టీఆర్‌, దివం గత మాజీ ఎమ్మెల్యే నారపుశెట్టి శ్రీరాములు విగ్రహా లకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యకర్త లు ఏర్పాటు చేసిన ఎడ్లబండి ఎక్కి డాక్టర్‌ గొట్టిపాటి లక్ష్మి, డాక్టర్‌ లలిత్‌సాగర్‌ దంపతులు తోలారు.

అనంతరం స్ధానిక మార్కెట్‌ యార్డులో రైతుపండుగ సభ నిర్వహించారు. ఈసందర్భంగా వక్తలు మా ట్లాడుతూ కూటమి ప్రభుత్వం అమలు చేసిన సూపర్‌ సిక్స్‌ పథకాల అమలు చేయటాన్ని వివరించారు. ట్రాక్టర్ల ర్యాలీ, రైతుపండుగ సభ సూపర్‌ సక్సెస్‌ కావటంతో నాయకులు, కార్యకర్తలు సంతోషం వ్యక్తం చేశారు.

Updated Date - Aug 17 , 2025 | 12:01 AM