రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం
ABN , Publish Date - Aug 10 , 2025 | 10:25 PM
రైతు సంక్షేమ మే ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే డాక్టర్ ఉగ్రనర సింహారెడ్డి అన్నారు. ఆదివారం పామూరు గ్రామ పం చాయతీ కార్యాలయంలో సొసైటీ కార్యాలయాన్ని ఏర్పా టుచేశారు. ఈసందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమా లు నిర్వహించారు.
- ఎమ్మెల్యే డాక్టర్ ఉగ్రనరసింహారెడ్డి
పామూరు, ఆగస్టు 10(ఆంధ్రజ్యోతి): రైతు సంక్షేమ మే ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే డాక్టర్ ఉగ్రనర సింహారెడ్డి అన్నారు. ఆదివారం పామూరు గ్రామ పం చాయతీ కార్యాలయంలో సొసైటీ కార్యాలయాన్ని ఏర్పా టుచేశారు. ఈసందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమా లు నిర్వహించారు. అనంతరం ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం చైర్మన్‌గా ఉప్పలపాటి హరి బాబు, డైరెక్టర్‌గా వై.రహీముల్లా బాధ్యతలు స్వీకరించా రు. ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే డాక్టర్ ఉగ్రనర సింహారెడ్డి మాట్లాడుతూ సొసైటీల ద్వారా ప్రభుత్వం మంజూరుచేసే రాయితీ పథకాల్లో రైతు ప్రయోజనాలకే అధిక ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. సార్వత్రిక ఎన్నికల్లో ఇచ్చిన సూపర్‌సిక్స్ హామీలను ఏడాది కాలంలో అమ లుపరుస్తున్న ఘనత కూటమి ప్రభుత్వానికే దక్కింద న్నారు. ప్రతిపక్ష పార్టీల ఆరోపణలను తిప్పికొట్టాల న్నారు. కార్యక్రమంలో పువ్వాడి వెంకటేశ్వర్లు, యారవ శ్రీనివాసులు, ఏప్రభాకర్‌చౌదరి, బొల్లా నరసింహారావు, పాలపర్తి వెంకటేశ్వర్లు, డీవీ మనోహార్, ఎస్‌వీ నారాయణ పాల్గొన్నారు.