Share News

రైతులకు అండగా నిలిచిన ప్రభుత్వం

ABN , Publish Date - Nov 19 , 2025 | 10:43 PM

ప్రజాప్రభుత్వం రైతులకు మేలు చేసేందుకు కొత్త ఆలోచనా విధానాలతో ముందుకు వెళుతోందని ఎమ్మెల్యే డాక్టర్‌ ముక్కు ఉగ్రనరసింహా రెడ్డి చెప్పారు.

రైతులకు అండగా నిలిచిన ప్రభుత్వం
చెక్కును అందజేస్తున్న ఎమ్మెల్యే డాక్టర్‌ ఉగ్ర

ఎమ్మెల్యే డాక్టర్‌ ఉగ్ర

కనిగిరి నియోజకవర్గంలో 42,303 మంది రైతులకు రూ.28.42కోట్ల నిధులు

వెలిగండ్ల, నవంబరు 19 (ఆంధ్రజ్యోతి) : ప్రజాప్రభుత్వం రైతులకు మేలు చేసేందుకు కొత్త ఆలోచనా విధానాలతో ముందుకు వెళుతోందని ఎమ్మెల్యే డాక్టర్‌ ముక్కు ఉగ్రనరసింహా రెడ్డి చెప్పారు. బుధవారం అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్‌ రెండో విడత నిధులు కార్యక్రమం వెలిగండ్లలో జరిగింది. ముందుగా రైతులతో కలిసి ప్రధానమంత్రి, ముఖ్యంత్రి చంద్రబాబు ప్రసంగాన్ని రైతులతో కలిసి వీక్షించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతులకు వ్యవసాయ పెట్టుబడుల కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా ఈ పథకాన్ని అమలు చేస్తున్నాయన్నారు. నియోజకవర్గంలో ఆరు మండలాలకు 42,300 మంది రైతులకు అన్నదాత సుఖీభవ పథకం కింద రూ.21.15 కోట్లు, పీఎం కిసాన్‌ కింద రూ.7.27 కోట్లు రైతుల ఖాతాల్లో జమ అయ్యాయన్నారు. ఈ కార్యక్రమంలో ఏడీఏ జైన్‌లాబ్ధిన్‌, ఏవో శిల్ప, మండల అధ్యక్షుడు కేలం ఇంద్రభూపాల్‌ రెడ్డి, ముత్తిరెడ్డి, దొడ్డా వెంకట సుబ్బారెడ్డి, గవదకట్ల హరి, నియోజకవర్గ రైతు అధ్యక్షుడు అక్కి శ్రీను, బొబ్బా రమణా రెడ్డి, కేసరి రమణా రెడ్డి, కర్ణాటి భాస్కర్‌ రెడ్డి, జయపాల్‌ రెడ్డి, మీనిగ కాశయ్య, చౌడారెడ్డి, వెంకటేశ్వర రెడ్డి, రాజగోపాల్‌ పాల్గొన్నారు.

Updated Date - Nov 19 , 2025 | 10:43 PM