విద్యాభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ
ABN , Publish Date - Sep 07 , 2025 | 10:54 PM
విద్యాభివృద్ధిపై ప్రభుత్వం ఎంతో శ్రద్ధ తీసుకుంటుందని ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డి అన్నారు. ఆదివారం పట్టణంలోని విఠా సుబ్బరత్నం కల్యాణ మండపంలో మండలస్థాయిలో ఉపాధ్యాయ దినోత్సవాన్ని నిర్వహించారు.
ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డి
గిద్దలూరు టౌన్, సెప్టెంబరు 7 (ఆంధ్రజ్యోతి): విద్యాభివృద్ధిపై ప్రభుత్వం ఎంతో శ్రద్ధ తీసుకుంటుందని ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డి అన్నారు. ఆదివారం పట్టణంలోని విఠా సుబ్బరత్నం కల్యాణ మండపంలో మండలస్థాయిలో ఉపాధ్యాయ దినోత్సవాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే అశోక్‌రెడ్డి మండలస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ, ఉపాధ్యాయినులను సన్మానించారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో ఉపాధ్యాయులను ఉద్దేశించి ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డి మాట్లాడుతూ జన్మనిచ్చిన తల్లిదండ్రులకు రుణపడి ఉన్నామ ని, జన్మసార్థకతకు దారి చూపిన గురువులకు మరింత రుణపడి ఉందామని తెలిపారు. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత మెగా డీఎస్సీ ద్వారా 16450 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేస్తుందని తెలిపారు. రాష్ట్రంలో పని చేస్తున్న ఉపాధ్యాయులను 75శాతం ఉపాధ్యాయులను తెలుగుదేశం ప్రభు త్వం భర్తీ చేసిందని ఆయన గుర్తు చేశా రు. డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం ద్వారా సన్నబియ్యంతో విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందిస్తున్నామని, సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్ర ద్వారా ఉచిత యూనిఫామ్, బూట్లు, పాఠ్యపుస్తకాలను విద్యార్థులకు అందిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో మార్కెట్ యార్డు చైర్మన్ బైలడుగు బాలయ్య, సొసైటీ బ్యాంక్ చైర్మన్ దుత్తా బాలీశ్వరయ్య, మున్సిపల్ కమిషనర్ రమణబాబు, మండల విద్యాశాఖాధికారులు నాగభూషన్‌రెడ్డి, అశ్వనీకుమార్, బీజేపీ నాయకులు పిడతల రమే్‌షరెడ్డి, పాఠశాలల ప్రధానోపాధ్యాయ నాయకులు టీకేఎస్ ప్రసాద్, రాఘవరెడ్డి పాల్గొన్నారు.
ఉపాధ్యాయుల సేవలు ఆదర్శనీయం
పెద్ద దోర్నాల : అంకితభావంతో పనిచేసి అందరి మన్ననలతో ఉత్తమ అవార్డులను పొందిన ఉపాధ్యాయుల సేవలు ఆదర్శనీయమని ఎంఈవో మస్తాన్ నాయక్ అన్నారు. స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలోని ఆడిటోరియంలో ఉత్తమ అవార్డులు పొందిన ఉపాధ్యాయులను ఆదివారం ఘనంగా సన్మానించారు. జిల్లా ఉత్తమ ఉపాధ్యాయులుగా గోపాలయ్య, మండల ఉత్తమ అవార్డులు పొందిన కూచిపూడి వెంకయ్య, దాసరి సుధాకర్, గూడూరి సువర్ణ, కేవీ నారాయమణమ్మ, బండ్లమూడి శ్రీనివాసులు షేక్ మహ్మద్ హనీ్‌ఫను ఎంఈవో ఉపాధ్యాయ సిబ్బంది శాలువాలు కప్పి, పూలమాలలతో సత్కరించారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు కిరణ్ కిశోర్ కుమార్, మహంత్ నాయక్, రామకృష్ణా నాయక్, ఎం వర్ధన్,కాశీరాములు,సొసైటీ అధ్యక్షులు బట్టు సుధాకర్ రెడ్డి, టీడీపీ నాయకులు షేక్ మాబు, ఈదర మల్లయ్య పాల్గొన్నారు.