అన్నపూర్ణాదేవిగా అమ్మవారు
ABN , Publish Date - Sep 25 , 2025 | 01:52 AM
దసరా శరన్నవరాత్రి ఉత్సవాలను మండలంలో భక్తులు ఘనంగా నిర్వహిస్తున్నారు.
పర్చూరు, సెప్టెంబరు 24 (ఆంధ్రజ్యోతి) : దసరా శరన్నవరాత్రి ఉత్సవాలను మండలంలో భక్తులు ఘనంగా నిర్వహిస్తున్నారు. కార్యక్రమంలో భాగంగా స్థానిక శ్రీ అద్దంకి నాంచారమ్మ అమ్మవారి ఆలయంలో బుధవారం అమ్మవారు అన్నపూర్ణాదేవి అలంకరణ లో భక్తులకు దర్శనమిచ్చారు. వేడుకల సందర్భంగా ఆయా ఆలయాలను విద్యుత్ దీపాలతో సుందరంగా అలంక రించారు. అదేవిధంగా పర్చూరులోని శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి అలయంలో స్వామివారి ఉత్సవ వేడుకలను అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. శరన్నవరాత్రుల వేడుకలను తిలకించేందుకు పెద్ద ఎత్తునభక్తులు తరలివచ్చారు. పూజాకార్యక్రమాల అనంతరం భక్తులకు ప్రసాద వినియోగాలు చేపడు తున్నారు. మండలంలోని చెరుకూరు, నాగుల పాలెం, ఉప్పుటూరు, అన్నంబొట్లవారిపాలెం, నూతల పాడు తదితర గ్రామాల్లో వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహిస్తున్నారు.
బల్లికురవ : దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు గ్రామాలలో కనుల పండువగా నిర్వహిస్తున్నారు. కొప్పెరపాడు బొడ్డురాయి కూడలి వద్ద ఏర్పాటు చేసిన దుర్గాదేవి బుధవారం అన్నపూర్ణదేవి ఆలంకరణలో భక్తులకు దర్శనం ఇచ్చారు. వేమవరం ఎస్టీ కాలనీలో ఏర్పాటు చేసిన దుర్గాదేవి విగ్రహాం వద్ద పూజలు నిర్వ హించారు. అంబడిపూడి, గుంటుపల్లి, కొండాయపాలెం, చెన్నుపల్లి, కొమ్మినేనివారిపాలెం గ్రామాలలోని దేవాల యాలలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు.
మార్టూరు : దసరా శరన్నవరాత్రుల ఉత్సవాలలో భాగంగా మూడవరోజు అమ్మవారు పలు ఆలయాల్లో అన్నపూర్ణాదేవిగా భక్తులకు దర్శనం ఇచ్చారు. మార్టూ రులో శ్రీదుర్గామల్లేశ్వరి దేవాలయంలో, ద్రోణాదులలోని అమ్మవారి ఆలయంలో, నాగరాజుపల్లి గ్రామంలోని దేవాలయంలో అన్నపూర్ణాదేవి అవతారంలో భక్తులు అలంకరించారు.తదుపరి ప్రత్యేక పూజా కార్యక్రమాలను చేసిన తర్వాత, భక్తులకు తీర్థప్రసాదాలను పంపిణీ చేశారు.
పంగులూరు : మండలంలో శ్రీదేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు బుధవారం ఘనంగా నిర్వహించారు. ఆల య అర్చక స్వాములు అమ్మవారిని అన్నపూర్ణాదేవి గా భక్తులకు దర్శనం ఇచ్చారు. ముప్పవరంలోని శీలక్ష్మీ గణపతి షిర్డీసాయి ఆలయం లో గణపతిపూజ, నవావర్ణ పూజ, కలశస్థాపన, స్వామి వారికి అభిషేకము, సూక్త హోమము, రుద్రహోమము నిర్వహించారు. సాయంత్రం శ్రీదేవీ నవావరణ, అన్నపూర్ణాదేవి, శ్రీలలితాదేవి సహస్రనామం జపించి కుంకుమపూజ చేశారు. కొండమూరు, రామకూరు గ్రామాలలో అన్న పూర్ణాదేవిగా దర్శనమిచ్చిన అమ్మవారికి భక్తులు ప్రత్యేక పూజలుచేశారు. చందలూరులోని రామ లింగేశ్వరస్వామి, పంగులూరులోని భీమలింగేశ్వర స్వామి ఆలయాలలో అమ్మవారికి ప్రత్యేక అలంకరణ చేసి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అమ్మవారిని దర్శించుకున్న భక్తులకు తీర్ధప్రసాదాలు అందచేశారు.
చినగంజాం : మండల పరిధిలోని పలు గ్రామాల్లోని ఆలయాల్లో దసరా పండుగను పురస్కరించుకొని శరన్నవరాత్రులు ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తు న్నారు. శరన్నవ ఉత్సవాలలో భాగంగా దేవి మండపా లు, ఆలయాల్లో అమ్మవార్లను వివిధ అలంకరాల్లో అలంకరించి పూజలు జరుపుతున్నారు. స్థానిక భూ సమేత భావనారాయణస్వామి దేవస్థానంలో 18వ వార్షిక బ్రహోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. బ్రహ్మోత్సవాలలో భాగంగా ఉదయం దేవస్థానంలో శ్రీవారికి, అమ్మవార్లకు విశేష పూజలు, విశేష హోమములు జరిపారు. రాత్రికి హనుమద్వాహనంపై శ్రీవారికి గ్రామంలో గ్రామోత్సవం నిర్వహించారు. గ్రామోత్సవంలో వాహనసేవ లో స్వామివారి ముందు భావనారాయణస్వామి కోలాటబృందం వేసిన కోలాటం భక్తులను ఆకట్టుకుంది. గొనసపూడి, పెదగంజాం, నీలాయపాలెం, కడవకుదురు, సంతరావూరు తదితర గ్రామాల్లో వివిధ రూపాల్లో అలంకరించిన అమ్మవార్లకు భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు.
అద్దంకి : దసరా శరన్నవరాత్రుల ఉత్సవాలలో భాగంగా బుధవారం అద్దంకి పట్టణంలోని కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవాలయంలో అమ్మవారిని అన్నపూర్ణాదేవిగా అలంకరించారు. వేయిస్తంభాల గుడి, దత్తపాదుకాక్షేత్రం తదితర దేవాలయాలలో అమ్మవారి ని ప్రత్యేకంగా అలంకరించారు. భక్తులు పెద్ద సంఖ్యలో అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.