పేదవారి ఆకలి తీర్చడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం
ABN , Publish Date - Dec 10 , 2025 | 10:55 PM
పేదవారి ఆకలి తీర్చడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి చెప్పారు. స్థానిక అన్నా క్యాంటీన్‌ను బుధవారం మధ్యాహ్నం ఎమ్మెల్యే కందుల ఆకస్మికంగా తనిఖీ చేశారు.
మార్కాపురం, డిసెంబరు 10 (ఆంధ్రజ్యోతి) : పేదవారి ఆకలి తీర్చడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి చెప్పారు. స్థానిక అన్నా క్యాంటీన్‌ను బుధవారం మధ్యాహ్నం ఎమ్మెల్యే కందుల ఆకస్మికంగా తనిఖీ చేశారు. ముందుగా ఆహార పదార్థాలను పరిశీలించారు. వాటిని రుచి చూశారు. అనంతరం ప్రజలకు ఆహార పదార్థాలు వడ్డించారు. నాణ్యతలో ఏమైనా లోటుపాట్లు ఉన్నాయా అని ప్రజల్ని ఆరా తీశారు. ఎలాంటి ఇబ్బందులు లేవని నాణ్యమైన ఆహారాన్ని అందిస్తున్నారని అందరూ తెలిపారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ చైర్మన్ మాలపాటి వెంకటరెడ్డి, పట్టణ పార్టీ అధ్యక్ష, కార్యదర్శులు పఠాన్ ఇబ్రహీంఖాన్, మేడిద రంగస్వామి పాల్గొన్నారు.