ప్రజాసమస్యల పరిష్కారమే లక్ష్యం
ABN , Publish Date - Jun 10 , 2025 | 11:08 PM
ప్రజాసమస్యల పరిష్కారమే తన లక్ష్యమని ఎమ్మెల్యే డాక్టర్ ఉగ్రనరసింహారెడ్డి అన్నారు.

ఎమ్మెల్యే డాక్టర్ ఉగ్రనరసిహారెడ్డి
కనిగిరి, జూన్ 10 (ఆంధ్రజ్యోతి): ప్రజాసమస్యల పరిష్కారమే తన లక్ష్యమని ఎమ్మెల్యే డాక్టర్ ఉగ్రనరసింహారెడ్డి అన్నారు. పట్టణంలోని 2వ వార్డులో నెలకొన్న సమస్య లపై ప్రజలను అడిగి తెలుసుకునేందుకు మంగ ళవారం ఆయన పర్యటించారు. బొగ్గులగొంది కాలనీ, శివనగర్ కాలనీల్లో వేకువజాము నుంచి పర్యటించారు. ఈసందర్భంగా ప్రజలు ఎదు ర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకు న్నారు.
ప్రధానంగా పారిశుధ్యం, మంచినీటి సరఫరా సమస్యలను ప్రజలు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువ చ్చారు. పారిశుధ్య సిబ్బంది సమయపాలన పాటించడంలేదన్నారు. ఒక్కోసారి వారం రోజు లు దాటినా రావటం లేదని ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. నివాసాల మద్య ఖాళీ ప్రదేశాల్లో చి ల్లచెట్లు మొలచి దోమలు, పాములు వస్తున్నాయని బొగ్గులగొంది కాలనీ వాసులు ఎమ్మెల్యేకు తెలిపారు. మురుగు కాల్వలు లేకపోవడంతో తప్పనిసరి పరి స్థితుల్లో వాడుక నీటిని రోడ్లపైకి వదులుతున్నట్లు చెప్పారు. కనీసం బ్లీచింగ్ చల్లిన సందర్భం లేదన్నారు. కొన్నిచోట్ల వీధి లైట్లు లేకపోవటంతో రాత్రి వేళల్లో బయటికి రావాలంటే భయంగా ఉందని
ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. ఖాళీ ప్రదేశాల్లో చిల్లచెట్లను తొలగించి ఫాగింగ్ చేయించటంతో పాటు బ్లీచింగ్ వేయించాలని మున్సిపల్ కమిషనర్ జోసఫ్ దానియే లును ఎమ్మెల్యే ఆదేశించారు. ఏఏ ప్రదేశాల్లో మురుగు కాల్వలు అవసరమో ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. డ్రైనేజీల్లో చెత్తా చెదారాలను ఎప్పటికప్పుడు తొలగిం చాలని ఎమ్మెల్యే ఆదేశించారు.
కార్యక్రమంలో టీడీపీ పట్టణాధ్యక్షుడు తమ్మినేని శ్రీనివాసరెడ్డి, ఫిరోజ్, సుబ్బారావు, నజిముద్దీన్, లక్ష్మయ్య, మున్సిపల్ అధికారులు, తదితరులు పా ల్గొన్నారు.