ప్రజా సమస్యల సత్వర పరిష్కారమే లక్ష్యం
ABN , Publish Date - Oct 08 , 2025 | 09:59 PM
ప్రజా సమస్యల పరిష్కారమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని గిద్దలూరు టీడీపీ నాయకుడు ముత్తుముల కృష్ణకిషోర్‌రెడ్డి అన్నారు. గ్రామ పంచాయతీ కార్యాలయంలో బుధవారం పబ్లిక్ గ్రీవెన్స్‌ను ఆయన ప్రారంభించారు.
కొమరోలు, అక్టోబరు 8 (ఆంధ్రజ్యోతి) : ప్రజా సమస్యల పరిష్కారమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని గిద్దలూరు టీడీపీ నాయకుడు ముత్తుముల కృష్ణకిషోర్‌రెడ్డి అన్నారు. గ్రామ పంచాయతీ కార్యాలయంలో బుధవారం పబ్లిక్ గ్రీవెన్స్‌ను ఆయన ప్రారంభించారు. ప్రజా సమస్యలను సత్వరమే పరిష్కరించేందుకు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డి ఆధ్వర్యంలో మండల కేంద్రాల్లో నిర్వహించే పబ్లిక్ గ్రీవెన్స్‌ను ప్రజలు వినియోగించుకోవాలని కృష్ణకిషోర్‌రెడ్డి కోరారు. కార్యక్రమంలో దేవరశెట్టి భాగ్యలక్ష్మి, టీడీపీ మండల అధ్యక్షుడు బోనేని వెంకటేశ్వర్లు, సొసైటీ అధ్యక్షుడు ముత్తుముల సంజీవరెడ్డి, బిజ్జం రవింద్రారెడ్డి, ఓబుల్‌రెడ్డి, శంకర్‌రెడ్డి, పీ4 టీం ఎంపీ షౌజాన్ పాల్గొన్నారు.