Share News

పేదలందరికీ పక్కా గృహాల కల్పనే లక్ష్యం

ABN , Publish Date - Nov 12 , 2025 | 10:22 PM

పేదలందరికీ పక్కా గృహాలు క ల్పించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి అన్నా రు. స్థానిక బాపూజీ కాలనీలో బుధవారం ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన 2.0లో భాగంగా పక్కా గృహాల నిర్మాణానికి భూమిపూజను చేశారు.

పేదలందరికీ పక్కా గృహాల కల్పనే లక్ష్యం
గృహ నిర్మాణానికి భూమిపూజ చేస్తున్న ఎమ్మెల్యే నారాయణరెడ్డి

బాపూజీ కాలనీలో ఇళ్ల నిర్మాణాలకు

భూమి పూజ చేసిన ఎమ్మెల్యే కందుల

మార్కాపురం, నవంబరు 12 (ఆంధ్రజ్యోతి): పేదలందరికీ పక్కా గృహాలు క ల్పించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి అన్నా రు. స్థానిక బాపూజీ కాలనీలో బుధవారం ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన 2.0లో భాగంగా పక్కా గృహాల నిర్మాణానికి భూమిపూజను చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే నారాయణరెడ్డి ముందుగా లబ్ధిదారులకు పక్కా గృహాల మంజూరు పత్రాలు అందజేసి నిర్మాణానికి శంకుస్థాపన నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం గృహ నిర్మాణశాఖ ద్వారా అర్హులైన పేదలందరికీ గృహాలు మం జూరు చేస్తుందన్నారు. ఈ ప్రభుత్వం పేదల పక్షపాతి అన్నారు. కార్యక్రమంలో హౌసింగ్‌ డీఈ అందె పవన్‌కుమార్‌, ఏఈ సాయిచంద్‌, మున్సిపల్‌ కమిషనర్‌ డీవీఎస్‌ నారాయణరావు, ఏఎంసీ చైర్మన్‌ మాలపాటి వెంకటరెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి తాళ్లపల్లి సత్యనారాయణ, పట్టణ పార్టీ అధ్యక్ష, కార్యదర్శులు పఠాన్‌ ఇబ్రహీంఖాన్‌, మేడిద రంగస్వామి, కనిగిరి బాలవెంకటరమణ, కొప్పుల శ్రీనివాసులు, టౌన్‌ యూత్‌ అధ్యక్షులు దొడ్డా దుర్గే్‌షరెడ్డి, నందం శేఖర్‌, బాబీ పాల్గొన్నారు.

ఏం చేశారని కోటి సంతకాల సేకరణ?

వైసీపీ నాయకులు జగన్‌ పాలనలో ఏమి చేశారని కోటి సంతకాల కార్యక్రమం చేస్తున్నారని ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి ఎద్దేవా చేశారు. పక్కా గృహాలకు భూమి పూజ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన విలేకరులతో మాట్లాడారు. పశ్చిమ ప్రకాశానికి ఎంతో కీలకమైన వెలిగొండ ప్రాజెక్టును పూర్తి చేయకుండానే చేసినట్లు ప్రారంభోత్సవం చేసినందుకా, మార్కాపురం జిల్లా ఇవ్వనందుకా, మెడికల్‌ కాలేజీని పూర్తి చేయ నందుకా అని ప్రశ్నించారు. వైసీపీ నాయకులు ఏ మొహం పెట్టుకుని కోటి సంతకాల సేకరణకు వెళ్తున్నారో అర్థం కావడంలేదన్నారు. రాష్ట్రాన్ని లూటీ చేసి అప్పుల ఊబిలోకి నెట్టిన వారికి ప్రజల దగ్గరకు వెళ్లే అర్హత ఉందా అని ఎమ్మెల్యే కందుల ప్రశ్నించారు.

Updated Date - Nov 12 , 2025 | 10:22 PM