Share News

ప్రతి ఇంటికీ తాగునీరు అందించడమే లక్ష్యం

ABN , Publish Date - Dec 22 , 2025 | 11:31 PM

ప్రతి ఇంటికీ రక్షిత తాగునీటిని అందించడమే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డి అన్నారు. బేస్తవారపేటలో సోమవారం జలజీవన్‌ మిషన్‌ ప్రాజెక్టుకు ఆయన భూమి పూజ చేశారు.

ప్రతి ఇంటికీ తాగునీరు అందించడమే లక్ష్యం
బేస్తవారపేటలో జలజీవన్‌మిషన్‌ ప్రాజెక్టుకు భూమి పూజల చేస్తున్న ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డి

ఎమ్మెల్యే అశోక్‌రెడ్డి

జలజీవన్‌ మిషన్‌ పనులకు భూమిపూజ

బేస్తవారపేట, డిసెంబరు 22 (ఆంధ్రజ్యోతి) : ప్రతి ఇంటికీ రక్షిత తాగునీటిని అందించడమే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డి అన్నారు. బేస్తవారపేటలో సోమవారం జలజీవన్‌ మిషన్‌ ప్రాజెక్టుకు ఆయన భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా అశోక్‌రెడ్డి మాట్లాడుతూ పశ్చిమ ప్రకాశంలో ప్రతి ఇంటికీ తాగునీటి అందిస్తామని ఇచ్చిన మాట ప్రకారం నేడని కార్యరూపం దాల్చిందన్నారు. మార్కాపురం జిల్లా వేదికగా ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌ చేతుల మీదుగా రూ.1290కోట్లతో ప్రారంభించిన జలజీవన్‌ మిషన్‌ ద్వారా అన్ని గ్రామాల్లో ప్రతి ఇంటికీ తాగునీటిని అందించేందుకు సీఎం చంద్రబాబు సారథ్యం, కేంద్ర సహకారంతో పథకం అమలు చేస్తున్నట్లు వివరించారు. అనంతరం షేక్‌ రషీద్‌ బాషా, షబ్బార్‌ బాషా ఏర్పాటు చేసిన మీసేవా కేంద్రాన్ని ప్రారంభించారు. అంతకముందు టీడీపీ కార్యాలయంలో సెమీ క్రిస్మస్‌ వేడుకలో పాల్గొని ఎమ్మెల్యే కేక్‌ కట్‌ చేసి క్రిస్మస్‌ శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో తహసీల్దార్‌ జీ తితేంద్ర, ఎంపీడీవో ఏవీ రంగనాయకులు, ఆర్‌డబ్ల్యూఎస్‌ డీఈ నవ కిషోర్‌, ప్రాజెక్టు ఏఈ శ్రీకాంత్‌, కంభం మార్కెట్‌ యార్డ్‌ చైర్మన్‌ పూనూరు భూపాల్‌రెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు సోరెడ్డి మోహన్‌రెడ్డి, పట్టణ అధ్యక్షుడు సైదులు, కూల్‌డ్రింక్‌ బాషా, చెట్టిచెర్ల మాజీ సర్పంచ్‌ తిగిరెడ్డి భూపాల్‌రెడ్డి. ఎ.ఇంద్రసేనారెడ్డి, బి.ప్రేమానందం, పూనూరు జగన్మోహన్‌రెడ్డి, ఇండ్ల శేఖర్‌రెడ్డి, పార్టీ మహిళా అధ్యక్షురాలు సున్నం అనిత, విద్యుత్‌ శాఖ కాంట్రాక్టర్‌ మోక్షగుండం భాస్కర్‌రెడ్డి, చిన్న ఓబినేనిపల్లె సర్పంచ్‌ శ్రీనీశ్వరరెడ్డి,రోషన్‌ బాబు, జనసేన పార్టీ కార్యదర్శి నరసింహారావు పాల్గొన్నారు.

Updated Date - Dec 22 , 2025 | 11:31 PM