Share News

కల్తీ మద్యం నివారణే లక్ష్యం

ABN , Publish Date - Oct 25 , 2025 | 11:02 PM

రాష్ట్రంలో కల్తీ మద్యాన్ని నివారించడమే ప్రభుత్వ లక్ష్యమని టీడీపీ ఎర్రగొండపాలెం ఇన్‌చార్జి గూడూరి ఎరిక్షన్‌బాబు అన్నారు. పెద్దారవీడులోని మద్యం దుకాణాన్ని శనివారం టీడీపీ నాయకులు, ఎక్సైజ్‌ సిబ్బందితో కలిసి ఆయన సందర్శించారు.

కల్తీ మద్యం నివారణే లక్ష్యం
పోస్టర్‌ను ఆవిష్కరిస్తున్న టీడీపీ ఇన్‌చార్జి ఎరిక్షన్‌బాబు

టీడీపీ ఇన్‌చార్జి ఎరిక్షన్‌బాబు

పెద్దారవీడు, అక్టోబరు 25 (ఆంధ్రజ్యోతి) : రాష్ట్రంలో కల్తీ మద్యాన్ని నివారించడమే ప్రభుత్వ లక్ష్యమని టీడీపీ ఎర్రగొండపాలెం ఇన్‌చార్జి గూడూరి ఎరిక్షన్‌బాబు అన్నారు. పెద్దారవీడులోని మద్యం దుకాణాన్ని శనివారం టీడీపీ నాయకులు, ఎక్సైజ్‌ సిబ్బందితో కలిసి ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కల్తీ మద్యాన్ని నివారించడానికి ఎక్సైజ్‌ శాఖ ఆధ్వర్యంలో సురక్ష యాప్‌ను తీసుకొచ్చినట్లు చెప్పారు. ఏ స్థాయిలోని వ్యక్తులైనా కల్తీ మద్యాన్ని ప్రోత్సహించినా, విక్రయించినా చర్యలు తప్పవన్నారు. మద్యం దుకాణదారులు సురక్ష యాప్‌ ద్వారా మద్యం సీసాలను స్కాన్‌ చేసి విక్రయిస్తున్నారా? లేదా? పరిశీలించారు. కార్యక్రమంలో ఎక్సైజ్‌ సీఐ వెంకటరెడ్డి, టీడీపీ మండల అధ్యక్షుడు మెట్టు శ్రీనివాసులరెడ్డి, మాజీ అధ్యక్షుడు గొట్టం శ్రీనివాసులరెడ్డి, మాజీ ఎంపీపీ చంద్రగుంట్ల నాగేశ్వరరావు, మాజీ జడ్పీటీసీ చంద్రగుంట్ల నాగేశ్వరరావు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ఎస్సీ హాస్టల్‌కు శాశ్వత భవనం నిర్మించాలి

ఎరిక్షన్‌బాబును కోరిన విద్యార్థులు

పెద్దారవీడు పాఠశాల సమీపంలో ఎస్సీ హాస్టల్‌కు శాశ్వత భవనాన్ని నిర్మించాలని హాస్టల్‌ విద్యార్థులు ఎరిక్షన్‌బాబును కోరారు. ఎస్సీ హాస్టల్‌న ఆయన శనివారం సందర్శించారు. విద్యార్థుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం అద్దె భవనంలో నిర్వహిస్తున్న హాస్టల్‌ పాఠశాల కిలోమీటర్‌ దూరంలో ఉన్నదని, దీంతో పాఠశాలకు వెళ్లి రావాలంటే తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని వారు తెలిపారు. విద్యార్థుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని ఎరిక్షన్‌బాబు హామీ ఇచ్చారు.

మార్కాపురం : కల్తీలేని మద్యాన్ని విక్రయించేలా చర్యలు తీసుకోవడమే ప్రభుత్వ లక్ష్యమని మార్కాపురం ఎక్సైజ్‌ సీఐ ఎం.వెంకటరెడ్డి అన్నారు. తర్లుపాడు రోడ్డులోని రాయల్‌ వైన్‌షా్‌ప వద్ద శనివారం క్యూఆర్‌ కోడ్‌ను ఉపయోగించి కల్తీ మద్యాన్ని ఎలా గుర్తించాలో టీడీపీ నాయకులతో కలిసి సీఐ వెంకటరెడ్డి అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా టీడీపీ పట్టణాధ్యక్షుడు పఠాన్‌ ఇబ్రహీంఖాన్‌ మాట్లాడుతూ ఇటీవల వైసీపీ నాయకులు మద్యం విక్రయాలపై దుష్ప్రచారం చేస్తున్నారని అన్నారు. వారి పాలనలో కల్తీ మద్యం అమ్మి అమాయకుల ప్రాణాలు బలితీసుకున్నారన్నారు. ప్రస్తుత ప్రభుత్వం నాణ్యమైన మద్యంను అందించేందుకు చర్యలు తీసుకుందన్నారు. కార్యక్రమంలో ఏంసీ చైర్మన్‌ మాలపాటి వెంకటరెడ్డి, నీటి సంఘం అధ్యక్షులు దగ్గుల శ్రీనివాసరెడ్డి, కౌన్సిలర్‌ నాలి కొండయ్య యాదవ్‌, టీడీపీ నాయకులు కనిగిరి బాలవెంకటరమణ, మేడిద రంగస్వామి, ఈవీఎల్‌, శ్రీనివాసులు పాల్గొన్నారు.

Updated Date - Oct 25 , 2025 | 11:02 PM