Share News

కార్యకర్తను ప్రజాప్రతినిధిగా చేయడమే లక్ష్యం

ABN , Publish Date - Dec 27 , 2025 | 11:35 PM

కార్యకర్తను ప్రజా ప్రతినిధిగా చేయాలనేది టీడీపీ లక్ష్యమని రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో దానిని రుజువు చేసేలా కార్యకర్తలను స్థానిక ఎన్నికల్లో గెలిపించి మన సత్తా చాటాలని ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామగోపాల్‌రెడ్డి అన్నారు.

కార్యకర్తను ప్రజాప్రతినిధిగా చేయడమే లక్ష్యం
విలేకరులతో మాట్లాడుతున్న ఎమ్మెల్సీ రామ్‌గోపాల్‌రెడ్డి

స్థానిక ఎన్నికల్లో సత్తాచాటుదాం

ఎమ్మెల్సీ రామగోపాల్‌రెడ్డి

త్రిపురాంతకం, డిసెంబరు 27 (ఆంధ్రజ్యోతి) : కార్యకర్తను ప్రజా ప్రతినిధిగా చేయాలనేది టీడీపీ లక్ష్యమని రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో దానిని రుజువు చేసేలా కార్యకర్తలను స్థానిక ఎన్నికల్లో గెలిపించి మన సత్తా చాటాలని ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామగోపాల్‌రెడ్డి అన్నారు. శనివారం ఎర్రగొండపాలెం వచ్చిన ఆయన జోనల్‌ హెడ్‌గా పార్టీ కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్న తాను ఎర్రగొండపాలెం నియోజకవర్గంలోని కార్యకర్తలతో కూడా సమావేశమై పార్టీ పరిస్థితిని సమీక్షించేందుకు వచ్చానని చెప్పారు. ఈ సందర్భంగా పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ నియోజకవర్గంలోని అన్ని మండలాల పార్టీ అధ్యక్షులు, బూత్‌, క్లస్టర్‌ నాయకులు, ఇతర ప్రజాప్రతినిధులందరితో మాట్లాడి సమస్యలను తెలుసుకునట్లు చెప్పారు. కొన్ని గ్రామాల్లో చిన్నపాటి సమస్యలు ఉన్నాయని, వాటిని పరిష్కరించలేక కాదుగాని సాంకేతికంగా వచ్చిన సమస్యలతో అలాగే ఉన్నాయన్నారు. ఎరిక్షన్‌బాబు నాయకత్వంలో అందరూ కలసికట్టుగా పనిచేయాలని సూచించారు. రానున్న స్థానిక ఎన్నికల్లో పార్టీ గెలుపుకు శక్తివంచన లేకుండా కృషి చేయాలని రామగోపాల్‌రెడ్డి కోరారు. సమావేశంలో టిడిపి ఇన్‌చార్జి గూడూరి ఎరిక్షన్‌బాబు, ఏఎంసీ చైర్మన్‌ చేకూరి సుబ్బయ్య, ఐదు మండలాల కన్వీనర్లు, పార్టీ నాయకులు ఉన్నారు.

Updated Date - Dec 27 , 2025 | 11:35 PM