Share News

300 ఎకరాల్లో పండ్ల తోటల సాగు లక్ష్యం

ABN , Publish Date - May 24 , 2025 | 10:16 PM

సీఎస్‌పురం మండలం లో 300 ఎకరాల్లో పండ్ల తోటల సాగు లక్ష్యంగా పెట్టుకున్నట్టు ఏపీవో శ్రీని వాసనాయక్‌ తెలిపారు. ఉపాధి హామీ పథకం కింద పండ్ల తోటల పెంప కానికి ఆసక్తి కలిగిన రైతులు దరఖాస్తు చేసుకోవాలన్నారు.

300 ఎకరాల్లో పండ్ల తోటల సాగు లక్ష్యం

సీఎస్‌పురం(పామూరు), మే 24 (ఆంధ్రజ్యోతి): సీఎస్‌పురం మండలం లో 300 ఎకరాల్లో పండ్ల తోటల సాగు లక్ష్యంగా పెట్టుకున్నట్టు ఏపీవో శ్రీని వాసనాయక్‌ తెలిపారు. ఉపాధి హామీ పథకం కింద పండ్ల తోటల పెంప కానికి ఆసక్తి కలిగిన రైతులు దరఖాస్తు చేసుకోవాలన్నారు. నిమ్మ, బత్తాయి, మామిడి, జామ, దానిమ్మ, డ్రాగన్‌ ఫ్రూట్‌ వంటి పంటలు సాగు చేసుకోవ డానికి ప్రభుత్వం అవకాశం కల్పించిందని చెప్పారు. పండ్ల తోటల పెంపకా నికి జాబ్‌కార్డు కలిగి ఉండాలన్నారు. సన్న, చిన్నకారు రైతులు, ఎస్సీ, ఎస్టీ, రైతులు 5 ఎకరాలు లోపు, నీటి వసతి కలిగి ఉండాలన్నారు. ఈ అర్హత కలి గిన రైతులు దరఖాస్తు చేసుకోవాలన్నారు. సాగుచేసే రైతుకు ఎకరాకు మూ డేళ్లు కలిపి పంటను బట్టి సుమారు లక్ష రూపాయలు ప్రభుత్వం ఇస్తుంద న్నారు. తోటను పెంచుకొనే రైతులకు వారి కుటుంబానికి కేటాయించిన వం ద రోజులు వారి మొక్కలు సంరక్షణ చేసుకొనేందుకు వారికే చెల్లిస్తారని అ న్నారు. ఆసక్తి కలిగిన రైతులు గ్రామంలోని ఉపాధి ఫీల్డ్‌ అసిస్టెంట్‌నుగాని, ఏపీవోనుగాని సంప్రదించి దరఖాస్తు చేసుకోవాలని కోరారు.

Updated Date - May 24 , 2025 | 10:16 PM