కనిగిరి అభివృద్ధే లక్ష్యం
ABN , Publish Date - Oct 07 , 2025 | 11:31 PM
డిజిట ల్ టెక్నాలజీ దిశగా కనిగిరి మున్సిపాల్టీ అభివృద్ధి జరగాలన్నదే తన లక్ష్యమని ఎమ్మె ల్యే డాక్టర్ ఉగ్రనరసింహారెడ్డి అన్నారు. మం గళవారం మున్సిపల్ సమావేశానికి మున్సి పల్ చైర్మన్ గఫార్ అధ్యక్ష వహించారు.
ఎమ్మెల్యే డాక్టర్ ఉగ్రనరసింహారెడ్డి
కనిగిరి, అక్టోబరు 7(ఆంధ్రజ్యోతి): డిజిట ల్ టెక్నాలజీ దిశగా కనిగిరి మున్సిపాల్టీ అభివృద్ధి జరగాలన్నదే తన లక్ష్యమని ఎమ్మె ల్యే డాక్టర్ ఉగ్రనరసింహారెడ్డి అన్నారు. మం గళవారం మున్సిపల్ సమావేశానికి మున్సి పల్ చైర్మన్ గఫార్ అధ్యక్ష వహించారు. ఈ సందర్బంగా ప్రధానంగా వార్డుల పునర్వ్య వస్థీకరణపై చర్చ జరిగింది. 20 వార్డుల నుంచి 28 వార్డులుగా పునర్విభజన చేస్తూ అజెండాలోని ముఖ్యాంశంగా చేర్చటం, వా ర్డుల వివరాలు, ప్రదేశాలు, ప్రాంతాలపై వీ డియో ద్వారా మున్సిపల్ టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ సువర్ణకుమార్ కౌన్సిలర్లకు వివరిం చారు. వాటిలో అభ్యంతరాలు, సూచనలు తెలియజేయాల్సిందిగా కోరటంతో కౌన్సిలర్లం దరూ మూజువాణి ద్వారా ఆమోదం తెలి పారు. అనంతరం పట్టణాభివృద్ధికి జరగాల్సి న పనులు, చేపట్టాల్సిన కార్యక్రమాలు, నీటి సరఫరా, పారిశుధ్యంపై రూ.5.33 కోట్ల పనులకు 57 అంశాలపై చర్చ జరిగింది.
ఈసందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ ఉగ్ర మాట్లాడుతూ పట్టణంలో మురుగు కాల్వ లు, పారిశుధ్య పనుల పేరుతో గతంలో రూ.30 లక్షలు ఎలా ఖర్చు చేశారో వివ రాలు చెప్పాలని ఏఈ అంజిరెడ్డిని నిలదీ శారు. 30 లక్షలతో మున్సిపాల్టీ మొత్తం పారిశుధ్య సమస్య లేకుండా చేయవచ్చని పేపర్లలోనే పనులు చేసినట్లు ఉంటే, క్షేత్ర స్థాయిలో ఆ పరిస్థితి లేదని అసహనం వ్య క్తం చేశారు. దీంతో అధికారులు గత మున్సి పల్ కమిషనర్ ఉన్నప్పుడు పనులు చేప ట్టారని తెలపటంతో వివరాలతో కూడిన ని వేదిక ఇవ్వాలని ఎమ్మెల్యే ఆదేశించారు. గత ప్రభుత్వంలో దొరువు అభివృద్ధి పేరుతో ము న్సిపాల్టీ సొమ్ము రూ.46 లక్షలు దుర్వినియో గం జరిగిందని ఎమ్మెల్యే తెలిపారు. సంబం ధిత కాంట్రాక్టు రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల ఈవిధంగా చేసినట్లు వివరించారు. సంబం ధిత కాంట్రాక్టు సంస్థపై విజిలెన్స్‌శాఖకు ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. కొండపైన శివాలయంకు సిమెంటు రోడ్డు నిర్మాణానికి చర్యలు చేపడుతున్నట్టు చెప్పారు. కౌన్సిల ర్ సత్యవతి మాట్లాడుతూ లాడేసాహెబ్ వీధి మలుపు వద్ద ఆటోలు రోడ్డుకు అడ్డం గా నిలిపివేసి మహిళలతో ఇబ్బందికరంగా ప్రవర్తిస్తున్నారని ఎమ్మెల్యే దృష్టికి తీసుకు వచ్చారు. వెంటనే ఈసమస్యను పరిష్కరిం చాలని, లేకుంటే పోలీసులకు ఫిర్యాదు చేయాలని కమిషనర్‌కు ఆదేశించారు.
పట్టణంలో ఒక్కో సచివాలయానికి ఒక్కో విద్యుత్ ట్రాలీ ఆటోను ఏర్పాటుచేసేందుకు సీఎస్‌ఆర్ ప్రోగ్రాం కింద ఎంతవరకు అవకాశం ఉందని మున్సిపల్‌శాఖ సీఎస్‌తో ఎమ్మెల్యే డాక్టర్ ఉగ్ర ఫోన్‌లో మాట్లాడారు. ఆదిశగా నివేదిక ఇవ్వాలని అధికారులను కోరారు. అసెంబ్లీ సమావేశాలకు ముందు మున్సిపాల్టీకి అవసరమైన పనులు, చేపట్టా ల్సిన అభివృద్ధిపై నివేదిక కోరితే ఇవ్వకుండా నిర్లక్ష్యం వహించారని టీపీవో సువర్ణకు మార్ తీరును ఎమ్మెల్యే తప్పుపట్టారు. నా గులుచెరువు అభివృద్ధికి రూ.ఒక కోటి మం జూరు కానున్నట్లు చెప్పారు. పట్టణంలో పలుచోట్ల వీధిలైట్లు వెలగటం లేదని, వెంటనే కొత్తవి అమర్చాలని అధికారులను ఆదేశించారు. కొండ వాగు, వంకల ఆక్ర మణలను గుర్తించి నోటీసులు జారీ చేయా లన్నారు. కనిగిరి మున్సిపాల్టీకి స్వచ్ఛ భార త్ అవార్డు రావటం శుభపరిణామమ న్నారు. అందుకు చైర్మన్‌ను, రాష్ట్రస్థాయి పురస్కారానికి ఎంపికైన కేతినేని సుశీలను సన్మానించారు. సమావేశంలో మున్సిపల్ క మిషనర్ కృష్ణమోహన్‌రెడ్డి, ఏఈ అంజిరెడ్డి, టీపీఎస్ సువర్ణకుమార్, తదితరులు పాల్గొ న్నారు.