Share News

యువత చేతుల్లో రాష్ట్ర భవిష్యత్తు

ABN , Publish Date - Sep 02 , 2025 | 10:53 PM

రాష్ట్ర భవిష్యత్తు యువత చేతుల్లో ఉందని టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ డాక్టర్‌ గొట్టిపాటి లక్ష్మి తెలిపారు. స్థానిక పీటీఎస్‌ కల్యాణ మండ పంలో మంగళవారం డాక్టర్‌ లక్ష్మి ఆధ్వర్యంలో రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ పర్యవేక్షణలో మె గా జాబ్‌ మేళా నిర్వహించారు.

యువత చేతుల్లో రాష్ట్ర భవిష్యత్తు
మెగా జాబ్‌ మేళాలో మాట్లాడుతున్న డాక్టర్‌ గొట్టిపాటి లక్ష్మి, పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే పాపారావు తదితరులు

టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌

డాక్టర్‌ గొట్టిపాటి లక్ష్మి

దర్శి, సెప్టెంబరు 2(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర భవిష్యత్తు యువత చేతుల్లో ఉందని టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ డాక్టర్‌ గొట్టిపాటి లక్ష్మి తెలిపారు. స్థానిక పీటీఎస్‌ కల్యాణ మండ పంలో మంగళవారం డాక్టర్‌ లక్ష్మి ఆధ్వర్యంలో రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ పర్యవేక్షణలో మె గా జాబ్‌ మేళా నిర్వహించారు. ఈ సంద ర్భంగా ఆమె మాట్లాడుతూ యువత అవకా శాలను అందిపుచ్చుకొని ఉన్నత శిఖరాలను అందుకోవాలని సూచించారు. స్వర్ణాంధ్రప్రదేశ్‌ లక్ష్యసా ధనలో యువత కీలకమన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో విస్త్తారంగా పరిశ్రమలు ఏర్పాటు అవుతున్నాయన్నారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్‌ యువతకు ఉద్యోగ కల్పనే లక్ష్యం గా కృషి చేస్తున్నట్టు చెప్పారు. వారి స్ఫూర్తితో దర్శి నియోజకవర్గంలోని యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ప్రతి ఏడాది జాబ్‌ మేళా ఏర్పాటుచేస్తు న్నట్టు చెప్పారు. డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌ పుట్టిన రోజు సందర్భంగా ప్రతి ఏడాది ఆనవాయితీగా మెగా జాబ్‌ మేళా నిర్వహిస్తున్న విషయాన్ని గుర్తు చేశారు.

గత వైసీపీ పాలకులు అవలంబించిన కక్షపూరిత వైఖరితో పరిశ్రమలు ఇతర రాష్ర్టాలకు వెళ్లిపోయా యని డాక్టర్‌ లక్ష్మి పేర్కొన్నారు. యువత గురించి ప ట్టించుకోకపోవటంతో నిరుద్యోగ సమస్య పెరిగిందన్నా రు. ప్రస్తుతం పరిశ్రమలు విరివిగా వస్తున్నందున యువతకు భారీగా ఉద్యోగ అవకాశాలు లభిస్తున్నా యన్నారు. మెగా డీఎస్సీ ద్వారా ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించిన ఘనత కూటమి ప్రభుత్వానికే దక్కుతుంద న్నారు. కష్టపడి పనిచేస్తే తప్పనిసరిగా ఉన్నత శిఖరా లు అందుకునే అవకాశాలు లభిస్తాయన్నారు. కా ర్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే నా రపుశెట్టి పాపారావు, టీడీపీ నియోజకవర్గ నాయకుడు డాక్టర్‌ కడియాల లలిత్‌సాగర్‌, మున్సిపల్‌ చైర్మన్‌ నారపుశెట్టి పిచ్చయ్య, ఏఎంసీ చైర్మన్‌ దారం నాగవేణి, సుబ్బారావు, జిల్లా ఎంప్లాయిమెంట్‌ అధికారి రమా దేవి, స్కిల్‌ డెవలప్‌మెంట్‌ ఆధి కారి రవితేజ, టీడీపీ పట్టణ అధ్యక్షుడు పుల్లలచెరువు చిన్నా, దర్శి, దొనకొండ, తాళ్లూరు, ముం డ్లమూరు మండలాల పార్టీ అ ధ్యక్షులు మారెళ్ల వెంకటేశ్వర్లు, మోడి ఆంజనేయులు, మేడగం వెంకటేశ్వరరెడ్డి, కూరపాటి శ్రీని వాసరావు, తదితరులు పాల్గొ న్నారు.

జాబ్‌ మేళాలో 34 కంపెనీలు పాల్గొన్నాయి. మొత్తం 612 మంది నిరుద్యోగులు హాజరుకాగా 192 మందికి ఉద్యోగ అవకాశాలు లభించాయి. మిగిలిన వారికి స్కిల్‌ డెవలప్‌మెంట్‌ ద్వారా శిక్షణ ఇచ్చి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని డాక్టర్‌ గొట్టిపాటి లక్ష్మి తెలిపారు.

కాగా, దర్శి పట్టణంలోని 19వ వార్డులో ఏ ర్పాటుచేసిన వినాయక విగ్రహం వద్ద మంగళవారం టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ డాక్టర్‌ గొట్టిపాటి లక్ష్మి, డాక్టర్‌ లలిత్‌సాగర్‌ దంపతులు పూజలు చేశారు. అనంతరం కాకతీయ కమ్మ సేవాసంఘం ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన గణేష్‌ నిమజ్జనం ఊరేగింపులో పా ల్గొన్నారు. ఈసందర్భంగా మహిళలు కోలాటం ప్రదర్శించారు.

Updated Date - Sep 02 , 2025 | 10:54 PM