Share News

ప్రభుత్వ పాఠశాలలకు పూర్వ వైభవం

ABN , Publish Date - Jul 10 , 2025 | 11:31 PM

ప్రజా ప్రభుత్వ పాలనలో విద్యా వ్యవస్థలో సమూల మార్పులకు శ్రీకారం చుట్టి, పూర్వవైభవానికి కృషి చేస్తుందని ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డి అన్నారు. కొమరోలులోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల, ప్రభుత్వ జూనియర్‌ కళాశాల ఆవరణలో జరిగిన మెగా పేరెంట్స్‌, టీచర్స్‌ మీటింగ్‌లో ఎమ్మెల్యే అశోక్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ప్రభుత్వ పాఠశాలలకు పూర్వ వైభవం
కంభం ప్రభుత్వ జూనియర్‌ కాలేజీలో విద్యార్థులతో కలిసి భోజనం చేస్తున్న ఎమ్మెల్యే అశోక్‌రెడ్డి

ఎమ్మెల్యే అశోక్‌రెడ్డి

కొమరోలు, జూలై 10 (ఆంధ్రజ్యోతి) : ప్రజా ప్రభుత్వ పాలనలో విద్యా వ్యవస్థలో సమూల మార్పులకు శ్రీకారం చుట్టి, పూర్వవైభవానికి కృషి చేస్తుందని ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డి అన్నారు. కొమరోలులోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల, ప్రభుత్వ జూనియర్‌ కళాశాల ఆవరణలో జరిగిన మెగా పేరెంట్స్‌, టీచర్స్‌ మీటింగ్‌లో ఎమ్మెల్యే అశోక్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సరస్వతీదేవి విగ్రహానికి పూలమాలలు వేసి పూజలు చేశారు. విద్యావ్యవస్థను వైసీపీ పాలకులు నిర్వీర్యం చేశారన్నారు. విలీనం పేరుతో గ్రామీణ ప్రాంతాలలో పేద వి ద్యార్థులకు విద్యను దూరం చేశారని ఆరోపించారు. ప్రజా ప్రభుత్వం రాగానే విద్యా శాఖ మంత్రి లోకేష్‌ ప్రభుత్వ పాఠశాలల పూర్వవైభవానికి ప్రణాళికలు రచించారని, నాణ్యమైన మంచి విద్యాబోధన, సన్నబియ్యంతో భోజనం, వసతలు కల్పనకు పెద్దపీట వేశారన్నారు. ము ఖ్యంగా తల్లికివందనం పథకంతో పేద తల్లులక ఆర్థిక చేయూతనందిస్తున్నారన్నారు. ఈ చర్యలతో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల చేరికలు గణనీయంగా పెరగుతున్నాయని అశోక్‌రెడ్డి వివరించారు. కార్యక్రమంలో ఎంపీపీ అమూల్య, హెచ్‌ఎం శివనాగేశ్వరరావు, ఎంఈవోలు వెంకటేశ్వర్లు, వెంకటరత్నం, తహసీల్దార్‌ భాగ్యలక్ష్మి, మండల టీడీపీ అధ్యక్షుడు బోనేని వెంకటేశ్వర్లు, సొసైటీ బ్యాంక్‌ చైర్మన్‌ రవీంద్రరెడ్డి, ఎంపీటీసీ మాజీ సభ్యుడు ఓబులరెడ్డి పాల్గొన్నారు.

కంభం : నాణ్యమైన విద్యను అందించడం ద్వారా విద్యార్థుల ఉ జ్వల భవిష్యత్‌కు తోడ్పాటు లభిస్తుందని, దీనికి ప్రభుత్వం, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, ప్రజల సమష్టి భాగస్వామ్యం, కృషి అవసరమ ని ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డి తెలిపారు. కంభం ప్రభుత్వ జూనియర్‌ కళాశాల, ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మెగా పేరెంట్‌ టీచర్‌ మీటింగ్‌లో ఎమ్మెల్యే పాల్గొన్నారు. పండుగ వాతావరణంలో జరిగిన మెగా టీచర్‌ పేరెంట్స్‌ మీటింగ్‌లో తల్లులకు, తండ్రులకు క్రీడలు నిర్వహించి బహుమతులను అందచేశారు. సర్వేపల్లి రాధాక్రిష్ణన్‌ విద్యామిత్ర లు అని పోటీ పరీక్షల మెటీరియల్‌, పాఠ్యపుస్తకాలను పరిశీలించారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్‌ సైమన్‌ విక్టర్‌, ఉన్నత పాఠశాల హెచ్‌ అబ్దుల్‌సత్తార్‌, ఎంపీపీ చేగిరెడ్డి తులసమ్మ, జడ్పీటీసీ సభ్యులు కె.జ్యోతి, శ్రీను, శ్రీను, కిశోర్‌, ప్రసాద్‌, భూపాల్‌రెడి పాల్గొన్నారు.

విద్యా వ్యవస్థలో సమూల మార్పు : ఎమ్మెల్యే కందుల

మార్కాపురం వన్‌టౌన్‌ : విద్యా వ్యవస్థలో సమూలమైన మార్పులను తీసుకొచ్చి విద్యార్థుల బంగారు భవిష్యత్‌కు బాటలు వేసిన ఘనత సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్‌కే దక్కుతుందని ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి అన్నారు. పట్టణంలోని జిల్లా పరిషత్‌ బాలు రు, బాలికల ఉన్నత పాఠశాలలలో విద్యార్థుల తల్లిదండ్రులు ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశంలో గురువారం ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా కందుల మాట్లాడుతూ.. విద్యార్థుల భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకొని సీఎం చంద్రబాబు అనేక పథకాలు ప్రవేశపెట్టి ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి బాటలు వేస్తున్నారన్నారు. వైసీపీ పాలనలో విద్యా వ్యవస్థ అవినీతి మయంగా మారిందన్నారు. సబ్‌ కలెక్టర్‌ వెంకట్‌ త్రివినాగ్‌ మాట్లాడుతూ.. అమ్మ అంటే రెండు అక్షరాలు కాదని, మన జీవితం అని ఆమెను గుండెల్లో పెట్టుకుని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో కల్పిస్తున్న సదుపాయాలు వినియోగించుకుని ఉత్తమ ఫలితాలు సాధించాలని విద్యార్థులకు సూచించారు. పాఠశాలల్లో విద్యార్థులకు మొక్కలు పంచి, స్కూల్‌ బ్యాగులను అందించారు. బాలికల ఉన్నత పాఠశాలలో ట్రిపుల్‌ ఐటీ సాధించిన 9 మంది బాలికలను సన్మానించారు. తల్లులకు విద్యార్థులతో పాదపూజ చేయించారు. కార్యక్రమంలో ఎంఈవోలు రామ్‌దాస్‌ నాయక్‌, శర్వాణి, ప్రధానోపాధ్యాయుడు ఎం.చంద్రశేఖర్‌రెడ్డి, శ్రీదేవి, టీడీపీ నాయకులు కందుల రామిరెడ్డి, వక్కలగడ్డ మల్లికార్జున్‌, తాళ్లపల్లి సత్యనారాయణ, ఆలపాటి వెంకటరెడ్డి, పఠాన్‌ ఇబ్రహీం ఖాన్‌, పఠాన్‌ నాగూర్‌ ఖాన్‌, పఠాన్‌ హుస్సేన్‌ ఖాన్‌, కౌన్సిలర్‌ నగేశ్‌ పాల్గొన్నారు.

గిద్దలూరు టౌన్‌ : సమాజంలో ప్రస్తుతం నెలకొన్న ప్రభావాలు విద్యార్థులపై పడుతుందని, ఆ కోవలో విద్యార్థులు మత్తు పదార్థాల జోలికి పోకుండా దూరంగా ఉండాలని ఎక్సైజ్‌ సీఐ ఎం.జయరావ్‌ అన్నారు. పట్టణంలోని జూనియర్‌, డిగ్రీ కళాశాలలో మెగా టీచర్స్‌, పేరెంట్స్‌ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. కార్యక్రమంలో ఎక్సైజ్‌ సీఐ జయరావ్‌, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

పొదిలి : పిల్లల భవిష్యత్‌ కోసం వారి నడవడవకను తల్లిదండ్రు లు, ఉపాధ్యాయులు గమనించాలని ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి సతీమణి కందుల వసంతలక్ష్మి అన్నారు. గురువారం జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో జరిగిన తల్లిదండ్రుల, ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశంలో ఆమెపాల్గొని మాట్లాడారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయుడు సయ్యద్‌ అజీమ్‌బాషా పాల్గొన్నారు. అలాగే బాలుర, బాలికల, ఉప్పలపాడు, కేజీబీవీ పాఠశాలల్లో పేరెంట్‌ మీటింగ్‌ జరిగింది.

రాచర్ల : విద్యార్థుల శ్రేయస్సు, వారి సంక్షేమమే పేరెంట్స్‌ టీచర్స్‌ మీటింగ్‌ ముఖ్య ఉద్దేశమని ఎంఈవో వి.గిరిధరశర్మ అన్నారు. మండలంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో గురువారం మెగా పీటీఎం కార్యక్రమాలను పండుగలా నిర్వహించారు. ఆదర్శ గురుకుల పాఠశాలలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కార్యక్రమంలో ఎంపీడీవో ఎస్‌.వెంకటరామిరెడ్డి, ఎస్సై పి.కోటేశ్వరరావు టీడీపీ మండల అధ్యక్షుడు కటికె యోగానంద్‌ పాల్గొన్నారు.

తర్లుపాడు : మండలంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో తల్లిదండ్రుల ఆత్మీయ సమావేశం పండుగ వాతావరణంలో జరిగింది. ఈ సందర్భంగా పలువురు ప్రధానోపాధ్యాయులు పాఠశాలలో జరుగుతున్న అభవృద్ధి గురించి పేరెంట్స్‌కు వివరించారు. పోటీల్లో ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు బహుమతులు అందించారు.

పెద్దారవీడు : పాఠశాల అభివృద్ధికి తల్లిదండ్రుల భాగస్వామ్యం కీలకమని ప్రథానోపాధ్యాయిని కేఎన్‌ కనకదుర్గ అన్నారు. జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో మెగా పేరెంట్స్‌, టీచర్స్‌ మీటింగ్‌ను గురువారం ఉత్సాహంగా నిర్వహించారు. ఏంఈవోలు శ్రీనివాసులు, సుబ్రమణ్యం మాట్లాడారు. కార్యక్రమంలో ఎస్‌ఎంసీ చైర్మన్‌ గొట్టం శివశంకర్‌రెడ్డి, వైస్‌ చైర్మన్‌ నాగమణి పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థిను లు ప్రదర్శించిన కోలాటం, జానపద నృత్యాలు అలరించాయి. సుంకేసులపాఠశాలలో గురువారం ప్రధానోపాధ్యాయుడు జి.శ్రీరాములు అధ్యక్షతన పేరెంట్స్‌ మీటింగ్‌ నిర్వహించారు. కార్యక్రమంలో సర్పంచ్‌ జి.రమేష్‌, మాజీ ఎంపీపీ చంద్రగుంట్ల నాగేశ్వరరావు, ఎస్‌ఎంసీ చైర్మన్‌ షేక్‌ షఫీ, పాల్గొన్నారు. సమావేశానికి హాజరైన తల్లులకు మూజికల్‌ చైర్స్‌, ముగ్గుల పోటీలు నిర్వహించారు.

విద్యార్థుల భవిష్యత్‌కు ప్రభుత్వం అండ .. టీడీపీ ఇన్‌చార్జి ఎరిక్షన్‌బాబు

త్రిపురాంతకం : విద్యార్థుల భవిష్యత్‌కు ప్రభుత్వం అండగా నిలిచిందని అందులో భాగంగానే ఇచ్చిన మాట ప్రకారం ఇంటిలో ఎంతమం ది పిల్లలు ఉంటే అంతమందికి తల్లికి వందనం అందిస్తోందని టీడీపీ ఇన్‌చార్జి గూడూరి ఎరిక్షన్‌బాబు అన్నారు. గురువారం జరిగిన మెగా పేరెంట్స్‌ టీచర్స్‌ సమావేశంలో దూపాడులోని గురుకుల పాఠశాలలో ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థుల భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకొని విద్యాభివృద్ధికి ప్రభుత్వం ఎంతో కృషిచేస్తుందని తెలిపారు. విద్యలో బాగా రాణించిన పిల్లలకు ప్రోగ్రెస్‌ కార్డులను అందజేశారు. విద్యార్థుల తల్లిద్రండులకు మొక్కలను పంపిణీ చేశారు.

ఎర్రగొండపాలెం : విద్యార్థుల నడతపై తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ చూపినపుడే విద్యలో రాణిస్తారని మండల ప్రత్యేకాధికారి విష్ణువర్ధన్‌రావు అన్నారు. స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాల, కస్తూర్బాలో గురువారం తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. కార్యక్రమంలో తహసీల్దార్‌ మంజునాథరెడ్డి, ఎంపీడీవో బీ శ్రీనివాసమూర్తి, ఎంఈవో ఆంజనేయులు, ఎస్‌వో తిరుమలాదేవి, టీడీపీ మండల అధ్యక్షుడు చేకూరి సుబ్బారావు మాజీ సర్పంచి కం చర్ల సత్యనారాయణగౌడ్‌, ఎంపీటీసీ సభ్యుడు ఆవులయ్య, ఎస్‌ఎంసీ చైర్మన్‌ రసూల్‌, నాయకులు పాల్గొన్నారు.

పెద్ద దోర్నాల : తల్లిదండ్రులు తమ పిల్లల ఉన్నత విద్యకు తోడ్పడాలని ఎంఈవో మస్తాన్‌ నాయక్‌ అన్నారు. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశం గురువారం నిర్వహించారు. కస్తూర్బాలో బాలికలు తల్లుల కాళ్లు కడిగి పాదాభివందనాలు చేశారు. కార్యక్రమాల్లో ఎంపీడీవో నాసర్‌ రెడ్డి, ఎస్‌ఐ మహేష్‌, ప్రభుత్వ ఉన్నత పాఠశాల హెచ్‌ఎం ప్రసన్నతాంజలి, కస్తూర్బా, ఏకలవ్య, జూనియర్‌ కాలేజీ ప్రిన్సిపాళ్లు అనూష, భరద్వాజ్‌, మహాలక్ష్మమ్మ, ఈశ్వర్‌సింగ్‌, వసంత జూనియర్‌, బీఎం డిగ్రీ కళాశాలల చైర్మన్‌ బట్టు రమణారెడ్డి పాల్గొన్నారు.

Updated Date - Jul 10 , 2025 | 11:31 PM