జిల్లా మంత్రితోనే జెండా ఆవిష్కరణ
ABN , Publish Date - Aug 13 , 2025 | 02:37 AM
స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఈనెల 15వ తేదీన ఒంగోలులోని పోలీసు పరేడ్ గ్రౌండ్‌లో నిర్వహించే వేడుకల్లో జాతీయ జెండాను జిల్లాకు చెందిన మంత్రి డాక్టర్ డోలా శ్రీబాలవీరాంజనేయస్వామి ఆవిష్కరించనున్నారు. ఆ మేరకు ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు వచ్చాయి.
గత ఏడాది మాదిరిగానే ఈసారి కూడా
ప్రభుత్వం ఉత్తర్వులు
ఒంగోలు, ఆగస్టు 12 (ఆంధ్రజ్యోతి) : స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఈనెల 15వ తేదీన ఒంగోలులోని పోలీసు పరేడ్ గ్రౌండ్‌లో నిర్వహించే వేడుకల్లో జాతీయ జెండాను జిల్లాకు చెందిన మంత్రి డాక్టర్ డోలా శ్రీబాలవీరాంజనేయస్వామి ఆవిష్కరించనున్నారు. ఆ మేరకు ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు వచ్చాయి. మంత్రులు సొంత జిల్లాల్లో ఆగస్టు 15న జెండా ఆవిష్కరణలు చేయడం అరుదుగా జరుగుతుంది. గతంలో ఏప్రభుత్వం అధికారంలో ఉన్నా ఇన్‌చార్జి మంత్రి జెండాను ఆవిష్కరిస్తుంటారు. అయితే ప్రస్తుత ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తొలి ఏడాది (గత సంవత్సరం) స్వాతంత్య్ర వేడుకల నాటికి ఇన్‌చార్జి మంత్రుల నియామక ప్రక్రియ పూర్తి కాలేదు. దీంతో జిల్లాకు చెందిన మంత్రులే జెండా ఆవిష్కరణలు చేశారు. ఈ ఏడాది కూడా అదేవిధానాన్ని అనుసరించనున్నారు. ఈమేరకు ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. ఆ ప్రకారం ఈనెల 15న ఒంగోలులోని పోలీసు పరేడ్ గ్రౌండ్‌లో జరిగే కార్యక్రమంలో డాక్టర్ స్వామి జాతీయ జెండాను ఎగురవేయనున్నారు.