Share News

సమస్యల పరిష్కారం కోసమే తొలి అడుగు

ABN , Publish Date - Dec 02 , 2025 | 01:48 AM

నియోజక వర్గంలో ప్రతీరోజు ప్రజాసమస్యల పరిష్కారంకోసమే తొలి అడుగు వేస్తున్నట్లు ఎమ్మెల్యే కొండయ్య పేర్కొ న్నారు.

సమస్యల పరిష్కారం కోసమే తొలి అడుగు

చీరాల, డిసెంబరు1 (ఆంధ్రజ్యోతి) : నియోజక వర్గంలో ప్రతీరోజు ప్రజాసమస్యల పరిష్కారంకోసమే తొలి అడుగు వేస్తున్నట్లు ఎమ్మెల్యే కొండయ్య పేర్కొ న్నారు. రాష్ట్రప్రభుత్వం పేద ప్రజలకు అందిస్తున్న సామాజిక పింఛన్ల పంపిణీ సోమవారం నియోజక వర్గంలో పండుగ వాతావరణంలో నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్‌ చైర్మన్‌ మించాల సాంబశివ రావుతో కలిసి మండల పరిధిలోని సాయికాలనీ, వేట పాలెంలో రామన్నపేట, పురపాలక సంఘం పరిధిలో 5వ వార్డులో పర్యటించారు. ప్రభుత్వం అఽధికారం చేప ట్టాక రాష్ట్రంలో 17 నెలల్లో రూ.50,763 కోట్లు పింఛన్ల ద్వారా అందించినట్లు వివరించారు. నిరుపేదలకు నివే శన స్థలాలుతో పాటు పక్కా గృహ కల్పనకు చర్యలు చేపట్టినట్లు చెప్పారు. కార్యక్రమంలో మున్సిపల్‌ కమిషనర్‌ అబ్దుల్‌ రషీద్‌, ఎంపీడీవోలు విజయ, రాజేష్‌బాబు, తదితర కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

మండలంలో 92శాతం ఫించన్ల పంపిణీ

పంగులూరు : మండలంలోని 21 పంచాయతీల పరిధిలో సోమవారం 92 శాతం ఫించన్ల పంపిణీ చేశా రు. మండలంలో మొత్తం సామాజిక ఫించన్లు 7,810 కాగా 7,164 మందికి ఫించన్లు అందచేశారు. మండల కేంద్రమైన పంగులూరులో టీడీపీ మండల అద్యక్షులు రావూరి రమేష్‌, ముప్పవరం గ్రామంలో క్లస్టర్‌ కో-ఆర్డినేటర్‌ కుక్కపల్లి ఏడుకొండలు, నియోజక వర్గ వాణిజ్య విభాగం అధ్యక్షులు గరిమిడి జగన్మోహన్‌ రావులు సామాజిక ఫించన్లు లబ్దిదారులకు అంద చేశారు. కార్యక్రమంలో ఎస్సీ సెల్‌ మండల అధ్యక్షుడు అద్దేపల్లి యోహాన్‌, టీడీపీ గ్రామ అద్యక్షులు వేల్పుల మరియదాసు, తిరుమలశెట్టి వీరాంజనేయులు సచివా లయ సిబ్బంది పాల్గొన్నారు.

బల్లికురవ : పించన్లను ప్రతి నెల ఒకటో తేదీన ఇంటింటికి అందజేసి నిరుపేద కుటుంబాలకు టీడీపీ ప్రభుత్వం అండగా నిలుస్తోందని టీడీపీ మండల ప్రధాన కార్యదర్శి కత్తి ఆశోక్‌బాబు అన్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు సోమవారం బల్లికురవ గ్రామంలో ఆయన వృద్ధులకు పించన్లను అందజేశారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ దేశంలో ఎక్కడ లేని విఽధంగా ఒక్క ఆంధ్ర రాష్ట్రంలోనే పెద్ద ఎత్తున పింఛన్లను ప్రభుత్వం అందజేస్తుందన్నారు. ఇంటింటికి తిరిగి లబ్దిదారులకు పించన్లను అందజేశారు.

యద్దనపూడి,(మార్టూరు) : దేశంలోనే సంక్షేమంలో ఆంధ్రప్రదేశ్‌ ప్రథమస్థానంలో నిలుస్తోందని ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు అన్నారు. సోమవారం ఆయన యద్దనపూడి మండలంలోని సూరవరపుపల్లి గ్రామం లో ఎన్టీఆర్‌ భరోసా పెన్షన్ల పంపిణీలో ఆయన పాల్గొన్నారు. నియోజకవర్గానికి కొత్తగా 80 పెన్షన్లు మంజూరయ్యాయన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ పెన్షన్‌ను మంజూరు చేయడం కూటమి ప్రభుత్వ లక్ష్యమన్నారు. అందరికీ ప్రతి నెలా 1వ తేదీ పెన్షన్ల నగదును అందజేసే విధం గా ప్రత్యేకంగా పర్యవేక్షణ చేస్తున్నామన్నారు. తరు వాత గ్రామంలోని రేషన్‌ దుకాణాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. రేషన్‌ సరుకుల నిల్వలు, పంపిణీ రిజిస్టర్‌, బయోమెట్రిక్‌ వ్యవస్థలను పరిశీలించారు. అనంతరం గ్రామంలో నూతనంగా నిర్మిస్తున్న సైడు డ్రైనేజీని, సిమెంట్‌రోడ్డును పరిశీలిం చారు. వాటిని వేగవంతంగా పూర్తిచేయాలని, నాణ్యతతో పను లు జరగాలని సంబందిత అధికారులకు సూచనలు చేశారు. అదేవిధంగా సైడుకాల్వల్లో మురుగునీరు సక్రమంగా పారేవిధంగా చూడాలని, నిల్వ ఉండరాదని సూచించారు. గ్రామంలోని పలువీధులలో పర్యటించారు. కార్యక్రమంలో కోయసతీష్‌, గుదే తారకరామారావు, వంశీ కృష్ణ, నల్లపనేని రంగయ్యచౌదరి, రావిపాటి సీతయ్య ఇంటూరి మురళి, అనిల్‌, తదితరులు పాల్గొన్నారు.

అసౌకర్యం లేకుండా ఫించన్ల పంపిణీ

పర్చూరు : ప్రభుత్వ సూచనలకు అనుగుణంగా ఫించన్‌దారులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా ఇంటివద్దనే ఫించన్ల పంపిణీ చేయనున్నట్లు ఎంపీడీవో వి.ప్రద్యుమ్నకుమార్‌ తెలిపారు. సోమవారం సచివా లయ సిబ్బంది, ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణుల సారధ్యంలో పర్చూరు మండల పరిఽధిలోని ఆయా గ్రామాల్లో ఫించన్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. గ్రామ కార్యదర్శులతోపాటు, సచివాలయం సిబ్బంది ఉదయం 6.30 గంటల నుంచి పించన్ల పంపిణీలో పాల్గొన్న ట్లు ఎంపీడీవో తెలిపారు.

Updated Date - Dec 02 , 2025 | 01:48 AM