Share News

ఎమర్జెన్సీ ల్యాండింగ్‌ను మరోచోటకు మార్చాలి

ABN , Publish Date - Dec 29 , 2025 | 01:19 AM

సింగరాయకొండలోని జాతీయ రహదారిపై కలికివాయి ఫ్లైఓవర్‌ నుంచి కనుమళ్ల రోడ్డు వరకు 3.6 కిలోమీటర్లు నిర్మించిన ఎమర్జెన్సీ ల్యాండింగ్‌ను మరొక చోటకు మార్చాలని కోరుతూ మూలగుంటపాడు, సింగరాయకొండ, కనుమళ్ల కలికివాయి గ్రామాల నాయకులు మంత్రి డోలా శ్రీబాలవీరాంజనేయస్వామికి వినతిపత్రం అందజేశారు.

ఎమర్జెన్సీ ల్యాండింగ్‌ను మరోచోటకు మార్చాలి

మంత్రి స్వామికి వినతి

సింగరాయకొండ, డిసెంబరు28 (ఆంధ్రజ్యోతి) : సింగరాయకొండలోని జాతీయ రహదారిపై కలికివాయి ఫ్లైఓవర్‌ నుంచి కనుమళ్ల రోడ్డు వరకు 3.6 కిలోమీటర్లు నిర్మించిన ఎమర్జెన్సీ ల్యాండింగ్‌ను మరొక చోటకు మార్చాలని కోరుతూ మూలగుంటపాడు, సింగరాయకొండ, కనుమళ్ల కలికివాయి గ్రామాల నాయకులు మంత్రి డోలా శ్రీబాలవీరాంజనేయస్వామికి వినతిపత్రం అందజేశారు. టంగుటూరు మండలం తూర్పునాయుడుపాలెంలోని మం త్రి క్యాంపు కార్యాలయంలో ఆదివారం జరిగిన ఈ కార్యక్రమంలో వారు తమ సమస్యలను మంత్రికి వివరించారు. రనేవే విస్తరణకు సు మారు 28 ఎకరాల భూమిని సేకరించడానికి నోటిఫికేషన్‌ జారీ చేశారని స్వామి దృష్టికి తీ సుకెళ్లారు. భూసేకరణ వలన రైతులు తీవ్రం గా నష్టపోతారని వివరించారు. రన్‌వే ఏర్పా టు వలన సింగరాయకొండ భవిష్యత్‌ ప్రశ్నార్థకంగా మారనున్నదని, నాలుగు గ్రామాల ప్రజ లకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని తెలిపారు. దీనిపై స్వామి స్పందిస్తూ పరిశీలించి తగిన న్యాయం చేస్తానని మంత్రి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో టీడీపీ ఒంగోలు పార్లమెం ట్‌ లీగల్‌సెల్‌ అధ్యక్షుడు సన్నెబోయిన శ్రీనివాసులు, కరుణాకర్‌రెడ్డి, రామ్మూర్తి, తిరుపతిరా వు, మురళి, శ్రీను, సుధాకర్‌ పాల్గొన్నారు.

Updated Date - Dec 29 , 2025 | 01:20 AM