శాస్త్రోక్తంగా అష్ట బంధన మహా సంప్రోక్షణ
ABN , Publish Date - May 10 , 2025 | 11:37 PM
గుండ్లకమ్మ నదీ తీరానా ఉన్న శ్రీలక్ష్మీ పద్మావతి సమేత కల్యాణ వేంకటేశ్వర స్వామి ఆలయంలో అష్ట బంధన మహా సంప్రోక్షణ కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా శనివారం నిర్వహించారు.
మార్కాపురం వన్‌టౌన్, మే 10 (ఆంధ్రజ్యోతి) : గుండ్లకమ్మ నదీ తీరానా ఉన్న శ్రీలక్ష్మీ పద్మావతి సమేత కల్యాణ వేంకటేశ్వర స్వామి ఆలయంలో అష్ట బంధన మహా సంప్రోక్షణ కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు ఏవీకే నరసింహాచార్యులు మాట్లాడుతూ.. అష్ట బంధన మహాసంప్రోక్షణ 12 సంవత్సరాలకోసారి నిర్వహిస్తారని, స్వామివారికి దివ్య తేజస్సు కలగడం కోసం ప్రత్యేక అభిషేకాలు, పూజలు చేస్తామని చెప్పారు. వేంకటేశ్వరుని మూలవిరాట్‌కు ప్రత్యేక పూజల అనంతరం లక్ష్మీ పద్మావతి సమేత వేంకటేశ్వరుని ఉత్సవమూర్తులను ప్రత్యేకంగా అలంకరించి వైభవంగా శాంతి కల్యాణం నిర్వహించారు. స్వామి మూలవిరాట్ నిజరూప పాదస్పర్శ దర్శనానిన భక్తులకు కల్పించారు. ఆలయ కమిటీ అధ్యక్షుడు చెక్కా మాలకొండ నరసింహారావు ఆధ్వర్యంలో కార్యక్రమాలు నిర్వహించారు.