వైసీపీ పాలనలో విద్యా వ్యవస్థ అస్తవ్యస్తం
ABN , Publish Date - May 18 , 2025 | 10:39 PM
వైసీపీ పాలనలో విద్యా వ్యవస్థ అస్తవ్యస్తమయిందని మార్కాపురం, కనిగిరి డివిజన్ తెలుగునాడు ఉపాధ్యాయ సంఘం అధ్యక్ష, కార్యదర్శులు రహమాన్, శ్రీనివాసులు ఆరోపించారు. సాథనిక పాఠశాల లో జరిగిన సమావేశంలో ఆయన మా ట్లాడారు.
తెలుగునాడు ఉపాధ్యాయ
సంఘ అధ్యక్షుడు రహమాన్
పెద్ద దోర్నాల, మే 18 (ఆంధ్రజ్యోతి) : వైసీపీ పాలనలో విద్యా వ్యవస్థ అస్తవ్యస్తమయిందని మార్కాపురం, కనిగిరి డివిజన్ తెలుగునాడు ఉపాధ్యాయ సంఘం అధ్యక్ష, కార్యదర్శులు రహమాన్, శ్రీనివాసులు ఆరోపించారు. సాథనిక పాఠశాల లో జరిగిన సమావేశంలో ఆయన మా ట్లాడారు. నూతనంగాఏర్పడిన ప్రభుత్వం అస్తవ్యస్తమయిన విద్యా వ్యవస్థను గాడిలో పెట్టేందుకు ప్రతి పంచాయతీలో మోడల్ ప్రమరీ స్కూల్ ఇస్తూ 59మంది విద్యార్థులకు 4పోస్టులు 60మందికి 5 పో స్టులు మంజూరు చేసిందన్నారు.గత ప్రభుత్వంనిర్బందంగా ఇంగ్లీషు మీడియం ప్రవేశపెట్టిందన్నారు. ఏ ఒక్కపాఠశాలను మూసివేయకేండా, పోస్టులు రద్దు చేయకుండా మెరుగైన విద్యను అందించేందుకు కృషి చేస్తోందన్నారు. ఉపాధ్యాయు లు ఆయా పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెరిగేలా తోడ్పడాలని కోరారు.