ఓబీసీలో కూలిన డ్రాప్
ABN , Publish Date - Aug 28 , 2025 | 10:50 PM
ఒంగోలు బ్రాంచ్ కాలువ(ఓబీసీ)లో దర్శి, పొదిలి రోడ్డు వద్ద డ్రాప్ కూలిపోయింది. సాగర్ కాలువల నిర్మాణ సమయంలో నీటి ప్రవాహాన్ని కట్టడి చేసేందుకు, ఎగువ ఉన్న మేజర్లకు సక్రమంగా నీరందించేందుకు వీలుగా ఈడ్రాప్‌ను నిర్మించారు. కాలక్రమంలో డ్రాప్ సామర్థ్యం కోల్పోయి పూర్తిగా దెబ్బతింది. గత వైసీపీ ప్రభుత్వం హయంలో పాలకులు సాగర్ కాలువల మరమ్మతుల గురించి పట్టించుకోకపోవటంతో కూలేదశకు చేరింది.
పట్టించుకోని అధికారులు
దర్శి, ఆగస్టు 28(ఆంధ్రజ్యోతి): ఒంగోలు బ్రాంచ్ కాలువ(ఓబీసీ)లో దర్శి, పొదిలి రోడ్డు వద్ద డ్రాప్ కూలిపోయింది. సాగర్ కాలువల నిర్మాణ సమయంలో నీటి ప్రవాహాన్ని కట్టడి చేసేందుకు, ఎగువ ఉన్న మేజర్లకు సక్రమంగా నీరందించేందుకు వీలుగా ఈడ్రాప్‌ను నిర్మించారు. కాలక్రమంలో డ్రాప్ సామర్థ్యం కోల్పోయి పూర్తిగా దెబ్బతింది. గత వైసీపీ ప్రభుత్వం హయంలో పాలకులు సాగర్ కాలువల మరమ్మతుల గురించి పట్టించుకోకపోవటంతో కూలేదశకు చేరింది. ఇటీవల భారీ వర్షాలు కురవటంతో శ్రీశైౖలం, సాగర్ జలాశయాలలు నిండటంతో పాటు ఉధృతంగా వరద రావటంతో సాగర్ కాలువలకు నీటిని మళ్లించారు. ఒంగోలు బ్రాంచ్ కాలువలో గతంలో ఎన్నడూలేని విధంగా గరిష్ఠంగా నీరు విడుదల చేయటంతో కాలువ కట్టలు, అంచులు తాకుతూ ప్రవహించాయి. ఉధృతంగా నీరు ప్రవహించటంతో ఆ వేగానికి ఈడ్రాప్ కొట్టుకుపోయింది.
అయితే, ఇక్కడ ఎస్‌కేజే పవర్ ప్రాజెక్టు నిర్మించారు. పవర్ ప్రాజెక్టుకు ఎగువ భాగాన సమాంత రంగా మరో కాలువను తవ్వారు. ప్రస్తుతం ఒంగోలు బ్రాంచ్ కాలువకు సాధారణంగా నీరు విడుదలైనప్పుడు ఆనీరంతా పవర్ ప్రాజెక్టులో నుంచి తవ్విన కాలువ ద్వారా కిందకు వెళ్తుంది. సాగర్ కాలువలకు నీటి ప్రవాహం పెరిగినప్పుడు పాత కాలువకు కూడా నీరు మళ్లిస్తారు. ప్రస్తుతం రెండు కాలువల్లో నీరు ప్రవహిస్తుంది. కూలిన డ్రాప్‌కు మరమ్మతులు చేసే విషయంపై ఎన్‌ఎస్‌పీ అధికా రులను వివరణ కోరగా.. ఆ ప్రాంతంలో కిలోమీటరు దూరం ఎస్‌కేజీ ప్రాజెక్టు మెయింటెన్స్ చేయాల్సి ఉందన్నారు. ఎక్కడైనా కాలువ కట్టలు కానీ, నిర్మా ణాలుకానీ దెబ్బతింటే పవర్ ప్రాజెక్టు వారు పునర్ని ర్మించాల్సి ఉందన్నారు. కారణాలు ఏమైనా 1.70 లక్షల ఎకరాలకు సాగు నీరందించే ఒంగోలు బ్రాంచ్ కాలువలో డ్రాప్ సగానికి పైగా కూలిపోయింది. దీంతో కాలువ కట్ట అంచులు కోసుకుపోయినప్పటికీ ఎవరూ పట్టించుకోకపోవటంపట్ల రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి కూలిన డ్రాప్‌ను వెంటనే పునర్నిర్మించాలని వారు కోరుతున్నారు.