పేదల సొంతింటి కల సాకారం
ABN , Publish Date - Nov 12 , 2025 | 11:10 PM
నియోజకవర్గంలో ప్రతి పేదవాని సొంతింటి కల సాకారం దిశగా అడుగులు వేస్తున్నా, ప్రతి ఒక్కరూ సహకరించాలని ఎమ్మెల్యే కొండయ్య చెప్పారు. బుధవారం పురపాలక సంఘం పరిధిలోని 1వ వార్డు 300 కాలనీలో మన ఇల్లు - మన గౌరవం కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.
మన ఇల్లు మన గౌరవం కార్యక్రమంలో పలు గృహ ప్రవేశాలు
గృహప్రవేశాలు చేసి ఇంటి పత్రాలు అందజేసిన ఎమ్మెల్యే కొండయ్య
చీరాల, నవంబరు12 (ఆంధ్రజ్యోతి) : నియోజకవర్గంలో ప్రతి పేదవాని సొంతింటి కల సాకారం దిశగా అడుగులు వేస్తున్నా, ప్రతి ఒక్కరూ సహకరించాలని ఎమ్మెల్యే కొండయ్య చెప్పారు. బుధవారం పురపాలక సంఘం పరిధిలోని 1వ వార్డు 300 కాలనీలో మన ఇల్లు - మన గౌరవం కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి ఆవాస్ యోజన ద్వారా నిర్మించిన నూతన సామూహిక గృహాలలో ప్రవేశాలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్క పేద కుటుంబానికి సొంతిల్లు ఉండాలనే ఎన్‌టీఆర్ ఆశయ సాధనకు ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్విరామ పోరాటం చేస్తున్నట్లు వివరించారు. అధికారం చేపట్టిన 17 నెలల్లో సుమారు 3 లక్షల నూతన గృహప్రవేశాలు నిర్వహించినట్లు చెప్పారు. చేనేత చీరకు జాతీయ గుర్తింపు, ఇటీవల ఆటోనగర్ సమస్యకు పరిష్కారం, అలాగే క్రిటికల్ కేర్ నిర్మాణంతో పాటు నేడు నూతన గృహ ప్రవేశాలు ఆనందాన్నిచ్చినట్లు ఎమ్మెల్యే తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ అబ్దుల్ రషీద్, మెప్మా మేనేజర్ కొండయ్య, హౌసింగ్ ఏఈ శ్రీనివాస్ పాల్గొన్నారు.
అద్దంకిలో....
అద్దంకి, నవంబరు12(ఆంధ్రజ్యోతి) : అర్హులందరికీ సొంతిల్లు కట్టించాలన్నదే ప్రభుత్వ ధ్యేయమని స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ డైరెక్టర్ చిన్ని శ్రీనివాసరావు చెప్పారు. అద్దంకి పట్టణంలో ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత 90 ఇళ్లు నిర్మించారు. అందులో భాగంగా బుధవారం పట్టణంలోని రాజీవ్‌కాలనీలో గృహప్రవేశం జరిగింది. మరో 170 మంది లబ్ధిదారులకు గృహాల మంజూరు పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ రవీంద్ర, హౌసింగ్ ఇంచార్జి డీఈ దుర్గారమేష్, వైస్ చైర్మన్ దేసు పద్మేష్, కౌన్సిలర్‌లు రజనీ, మాగులూరి తిరుపతమ్మ, అత్తులూరి రమేష్, టీడీపీ నేతలు కాకాని అశోక్, వడ్డవల్లి పూర్ణచం ద్రరావు, చిలుకూరి అనిల్, గార్లపాటి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.