పేదల వైద్యుడి మృతి అత్యంత బాధాకరం
ABN , Publish Date - Aug 04 , 2025 | 01:25 AM
నాణ్యమైన వైద్యం నిర్విరామంగా అందించి, ప్రజాదరణ పొందిన వైద్యులు డా.రిచర్డ్స్‌సన్ సాల్మన్ అకాల మరణం అత్యంత బాధాకరమని ఎమ్మెల్యే కొండయ్య, టీడీపీ నియోజకవర్గ అధికార ప్రతినిధి డా.మహేంద్రనాథ్ అన్నారు.
సాల్మన్‌సెంటర్(చీరాల), ఆగస్టు 3 (ఆంధ్ర జ్యోతి) : చీరాల ప్రాంతంలో వేలమంది నిరు పేదలకు నాణ్యమైన వైద్యం నిర్విరామంగా అందించి, ప్రజాదరణ పొందిన వైద్యులు డా.రిచర్డ్స్‌సన్ సాల్మన్ అకాల మరణం అత్యంత బాధాకరమని ఎమ్మెల్యే కొండయ్య, టీడీపీ నియోజకవర్గ అధికార ప్రతినిధి డా.మహేంద్రనాథ్ అన్నారు. ఆదివారం డా.సాల్మన్ పార్థివ దేహానికి నివాళులు అర్పిం చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైద్యులుగా, సంఘ సంస్కర్తగా ప్రజల్లో గుండె ల్లో ఆయన చిరస్థాయిగా నిలిచినట్లు పేర్కొ న్నారు. తండ్రిబాటలోనే ప్రజాసేవకు జీవితం అర్పిం చినట్లు చెప్పారు. అలాగే ప్రభుత్వ భవనాలకు సొంత స్థలాలను బహుకరించినట్లు వివరించారు. ఆయన కుటుం బ సభ్యులకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. కుటుంబానికి అండగా ఉంటామని చెప్పారు. వారి వెంట టీడీపీ కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.