బస్టాండ్‌ను పరిశుభ్రంగా ఉంచాలి
ABN , Publish Date - Aug 20 , 2025 | 11:00 PM
ఆర్టీసీ బస్టాండ్‌ను పరిశుభ్రంగా ఉంచాలని ఆర్టీసీ అసిస్టెంట్ డైరెక్టర్ టీ శోభామంజరి అన్నారు. బుధవారం ఆర్టీసీ బస్టాండ్‌ను పరిశీలించారు.
పొదిలి, ఆగస్టు 20 (ఆంధ్రజ్యోతి) : ఆర్టీసీ బస్టాండ్‌ను పరిశుభ్రంగా ఉంచాలని ఆర్టీసీ అసిస్టెంట్ డైరెక్టర్ టీ శోభామంజరి అన్నారు. బుధవారం ఆర్టీసీ బస్టాండ్‌ను పరిశీలించారు. అనంతరం స్త్రీ శక్తి పథ కం ద్వారా ఉచితంగా ప్రయాణిస్తున్న మహిళలతో మాట్లాడారు. బ స్టాండ్‌లో తాగునీటి వసతులు మెరుగుపరచాలని చెప్పారు. బస్సుల ఫిట్‌నెస్ గురించి గ్యారేజీలో కార్మికులతో మాట్లాడారు. బస్సుల్లో ప్రయాణికుల సంఖ్య పెరుగుతున్న దృష్ట్యా బస్సుల ఫిట్‌నె్‌సతోపాటు సిబ్బంది ప్రవర్తన మారాలన్నారు. డీఎం కార్యాలయంలో పలురకాల సిబ్బందితో మాట్లాడారు. ఆమె వెంట డీఎం శంకరరావు, సీఐ ధనలక్ష్మి ఉన్నారు.