Share News

బ్రిడ్జికి మరమ్మతులు చేయాలి

ABN , Publish Date - Nov 09 , 2025 | 10:27 PM

చారిత్రాత్మక కంభం చెరువు కట్టకు వెళ్లే దారి మధ్యలో ఉన్న అలుగు వాగు ఇబ్బందికరంగా మారింది. వివరాలలోకి వెళితే.. ఇటీవల మొంథా తుఫాన్‌తో కురిసిన భారీ వర్షాలకు కంభం చెరువు పూర్తిగా నిండింది.

బ్రిడ్జికి మరమ్మతులు చేయాలి
వరద ప్రవాహానికి కోతకు గురైన అలుగు వాగు బ్రిడ్జి

కోతకు గురైన అలుగువాగు వంతెన

కంభం చెరువు కట్టకు వెళ్లే ప్రయాణికుల అవస్థలు

కంభం, నవంబరు 9 (ఆంధ్రజ్యోతి) : చారిత్రాత్మక కంభం చెరువు కట్టకు వెళ్లే దారి మధ్యలో ఉన్న అలుగు వాగు ఇబ్బందికరంగా మారింది. వివరాలలోకి వెళితే.. ఇటీవల మొంథా తుఫాన్‌తో కురిసిన భారీ వర్షాలకు కంభం చెరువు పూర్తిగా నిండింది. 5అడుగుల ఎత్తులో ఉధృతంగా అలుగు కూడా పారింది. ఈ అలుగు నీరు మొత్తం గుండ్లకమ్మ వాగు ద్వారా కంభం చెరువు కట్టకి వెళ్లే ప్రధాన రహదారి మధ్యలో బ్రిడ్జిపై నుంచి 10రోజలుగా ప్రవహించింది. దీంతో బ్రిడ్జి, రోడ్డు కోతకు గురై గుంతలు ఏర్పడ్డాయి. దెబ్బతిన్న ఈ రహదారి బ్రిడ్జిపై నుంచి చెరువును చూసేందుకు వివిధ వాహనాలలో పర్యాటకులు ప్రమాదకరంగా ప్రయాణిస్తున్నారు. వాగు అవతల ఉన్న అరటి తోటల నుంచి ట్రాక్టర్లలో, లారీలలో అరటి గెలలు తీసుకొచ్చే సమయంలో కూడా ప్రమాదం జరిగే అవకాశం ఉందని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. అధికారులు తక్షణమే స్పందించి కోతకు గురైన రోడ్డును బ్రిడ్జికి మరమ్మతులు చేసి పర్యాటకుల రాకపోకలకు ఇబ్బందులు లేకుండా చూడాలని కోరుతున్నారు.

Updated Date - Nov 09 , 2025 | 10:27 PM