Share News

బోగస్‌ గ్రూపుల బాగోతం అక్కడ నుంచే..!

ABN , Publish Date - May 16 , 2025 | 11:49 PM

పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ (మెప్మా)లో బోగస్‌ గ్రూపుల పేరుతో భారీగా రుణాలు పొందిన అవినీతి ఆర్పీలపై విచారణ కొనసాగుతోంది. ఆంధ్రజ్యోతిలో వచ్చిన కథ నంపై అవినీతి ఆర్పీలలో కలవరపాటు మొదలవగా, వాస్తవాలు నిగ్గుతేల్చేందుకు మెప్మా ప్రాజెక్టు డైరెక్టర్‌ శ్రీహరి నలుగురు ఉద్యోగులతో విచారణకు ఆదేశించా రు.

 బోగస్‌ గ్రూపుల బాగోతం అక్కడ నుంచే..!

ఆధార్‌ సీడింగ్‌కు వసూళ్లు

బ్యాంకుల నుంచి రుణాల వివరాలు కోరుతున్న మెప్మా అధికారులు

కొనసాగుతున్న విచారణ

ఒంగోలు కార్పొరేషన్‌, మే 16 (ఆంధ్రజ్యోతి) : పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ (మెప్మా)లో బోగస్‌ గ్రూపుల పేరుతో భారీగా రుణాలు పొందిన అవినీతి ఆర్పీలపై విచారణ కొనసాగుతోంది. ఆంధ్రజ్యోతిలో వచ్చిన కథ నంపై అవినీతి ఆర్పీలలో కలవరపాటు మొదలవగా, వాస్తవాలు నిగ్గుతేల్చేందుకు మెప్మా ప్రాజెక్టు డైరెక్టర్‌ శ్రీహరి నలుగురు ఉద్యోగులతో విచారణకు ఆదేశించా రు. దీంతో ఈ నాలుగు నెలల్లో బ్యాంకుల వారీగా రు ణాల మంజూరు, తీసుకున్న గ్రూపులపై లోతుగా వి చారణ మొదలు పెట్టారు. అందిన సమాచారం మేర కు ఒంగోలు నగరం కర్నూలురోడ్‌లోని సేయింట్‌ జేవి యర్స్‌ స్కూలు సమీపంలోని ఓ బ్యాంకులోనే అత్యధి కంగా బోగస్‌ గ్రూపుల పేరుతో రుణాలు పొందినట్లు ప్రాథమికంగా విచారణ అధికారులు గుర్తించినట్లు స మాచారం. ఇదిలా ఉంచితే తీగలాగితే డొంక కదిలినట్లు అసలు బోగస్‌ గ్రూపుల బాగోతం అంతా మెప్మా కా ర్యాలయం కేంద్రంగా జరిగినట్లు తెలుస్తున్నది. కార్యాల యంలో పనిచేసే ఓ ఉద్యోగి టీఎల్‌ఎఫ్‌ఆర్పీ, ఆధార్‌ సీడింగ్‌ కోసం ఒక్కో గ్రూపు నుంచి రూ.50 వేలు వసూ లు చేసినట్లుగా కొందరు ఆర్పీలు ఇప్పటికే విచారణ అధికారులకు వెల్లడించినట్లు సమాచారం. అయితే ఇ దే విషయంలో గతంలో సీఎంఎంగా పనిచేసి, అవినీతి ఆరోపణలతో ఇటీవల విధుల నుంచి తొలగించడిన ఉ ద్యోగి పాత్ర కీలకంగానే ఉంది. విధుల నుంచి తొల గించినా, తాను విధుల్లో ఉన్న సమయంలో తీసుకున్న రుణాలకు సంతకం చేసి సహకరించానని, తన వాటా తనకు ఇవ్వాల్సిందేనని ఇప్పటికీ కొందరు ఆర్పీలకు ఫో న్‌లు చేసి డిమాండ్‌ చేస్తున్నట్లు కొందరు ఆర్పీలు వె ల్లడిస్తున్నారు. మెప్మాలో బోగస్‌ గ్రూపుల విచారణ కొనసాతుండటంతో అందులో భాగస్వాములైనవారిలో కలవరం కలిగిస్తోంది.

ఆ బ్యాంక్‌లోనే..

ఈ ఏడాది జనవరి నుంచి ఏప్రిల్‌ నెలాఖరు వరకు బ్యాంకుల వారీగా తీసుకున్న పొదుపు రుణాల జాబితా పై కొన్ని ఇబ్బందులు ఎదురవుతున్నట్లు తెలిసింది. గ్రూపుల రుణాల వివరాలను కొన్ని బ్యాంకుల అధికా రులు మెప్మా ఉద్యోగులకు అందిస్తూ సహకరిస్తుండగా, మరికొన్ని బ్యాంకులు, సహకరించకపోవడంతో పీడీ శ్రీహరి ఆయా బ్యాంకుల జనరల్‌ మేనేజర్‌లకు లేఖలు రాశారు. ఈ ఏడాది జనవరి నుంచి మెప్మా ద్వారా పొం దిన రుణాలు, గ్రూపుల వివరాలు సమాచారం అం దించాలని కోరారు. అయితే విచారణలో వెలుగు చూ స్తున్న వాస్తవాలు ఒకొక్కటి అధికారులకు ఆశ్చర్యం కలి గిస్తున్నాయి. మరోవైపు కర్నూలురోడ్‌లోని ఓ బ్యాంకులో అత్యధికంగా బోగస్‌ గ్రూపుల పేరుతో రుణాలు తీసుకు న్నట్లు సమాచారం. ఈ వారం రోజుల విచారణలో అస లు కథ అంతా కార్యాలయం నుంచే మొదలైందని, అం దులో విధుల నుంచి తొలగించబడిన ఉద్యోగి, ప్రస్తుతం పనిచేస్తున్న మరో ఉద్యోగి పాత్ర ఉన్నట్లుగా ప్రాఽథమిక అంచనాకు వచ్చినట్లుగా తెలుస్తోంది.

కొన్ని బ్యాంకులు సహకరించడం లేదు

బోగస్‌ గ్రూపుల పేరుతో భారీగా రుణదోపిడీ చేయడంపై విచారణ కొనసాగుతోంది. బ్యాంకుల వా రీగా రుణాలు పొందిన గ్రూపుల వివరాలు కోరగా కొన్ని బ్యాంకుల వారు ఇవ్వడానికి సుముఖత చూపడం లేదు. దీంతో ఆయా బ్యాంకుల రీజనల్‌ మేనేజర్‌లకు లే ఖలు పంపాం. పూర్తిస్థాయిలో విచారణ చేసి బాధ్యు లపై శాఖపరంగా చర్యలు తీసుకుంటాం.

- పి.శ్రీహరి, మెప్మా పీడీ

Updated Date - May 16 , 2025 | 11:49 PM