బయోగ్యాస్ ప్లాంట్‌ను త్వరితగతిన పూర్తిచేయాలి
ABN , Publish Date - Sep 25 , 2025 | 10:32 PM
రిలయన్స్ కం ప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్ ని ర్మాణాన్ని త్వరగా పూర్తిచేయా లని కలెక్టర్ పి.రాజాబాబు అన్నారు. పీసీపల్లి మండలం లోని దివాకరపురంలో సీజీబీ ప్లాంట్ భూమిని గురువారం ఆయన పరిశీలించారు. అనంతరం రిలయన్స్ కంపెనీ ప్రతినిధులతో సమావేశమైన ఆయన ప్లాంట్ నిర్మాణ పురోగతి, కేటాయించిన భూముల వివరాలను కంపెనీ ప్రతినిధులను అడిగి తెలుసుకున్నారు.
కలెక్టర్ రాజాబాబు
పీసీపల్లి, సెప్టెంబరు 25 (ఆంధ్రజ్యోతి): రిలయన్స్ కం ప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్ ని ర్మాణాన్ని త్వరగా పూర్తిచేయా లని కలెక్టర్ పి.రాజాబాబు అన్నారు. పీసీపల్లి మండలం లోని దివాకరపురంలో సీజీబీ ప్లాంట్ భూమిని గురువారం ఆయన పరిశీలించారు. అనంతరం రిలయన్స్ కంపెనీ ప్రతినిధులతో సమావేశమైన ఆయన ప్లాంట్ నిర్మాణ పురోగతి, కేటాయించిన భూముల వివరాలను కంపెనీ ప్రతినిధులను అడిగి తెలుసుకున్నారు. కలెక్టర్ రాజా బాబు మాట్లాడుతూ ఈ ప్లాంట్ నిర్మాణాన్ని త్వరితగ తిన పూర్తిచేయడం ద్వారా ఈ ప్రాంత ప్రజలకు ఉ పాధి అవకాశాలు కల్పించిన వారమవుతామని అన్నా రు. కార్యక్ర మంలో జా యింట్ కలె క్టర్ ఆ ర్.గోపాల కృష్ణ, ఆర్డీవో కేశవర్ధన్ రె డ్డి, సీబీజీ ప్లాంట్ కన్ స్ట్రక్షన్ మేనేజర్ టి.బాబు, ప్లాంట్ సివిల్ హెడ్ వెంకట్రావు, తహసీల్దార్ సీహెచ్ ఉష, ఎంపీడీవో జీవీ క్రిష్ణారావు, వెంగళాయపల్లి సర్పంచ్ కరణం తిరుపత య్య, తదితరులు పాల్గొన్నారు.
గడువులోగా పనులు పూర్తిచేయాలి
తాళ్లూరు, సెప్టెంబరు 25 (ఆంధ్రజ్యోతి): సీఎం చంద్రబాబు తొలిప్రాధాన్యత ఇచ్చిన బెంగుళూరు-కడప-విజయవాడ గ్రీన్‌హోల్డ్ హైవే ఎక్స్‌ప్రెస్ రోడ్డు నిర్మాణ పనులు నిర్దేశించిన సమయానికి పూర్తిచేయాలని కలెక్టర్ పి.రాజాబాబు ఆదేశించారు. తాళ్లూరు మండలంలో జరుగుతున్న పనులను గురువారం పరిశీలించారు. అనంతరం స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో అధికారులు, కాంట్రాక్టర్‌లతో జరిగిన స మీక్షలో ఆయన మాట్లాడారు. రోడ్డు నిర్మాణపనుల్లో క్షేత్రస్థాయిలో సమస్యలు వుంటే తమ దృష్టికి తీసుకరావాలన్నారు. మండలానికి వచ్చిన కలెక్టర్ రాజాబాబును ఎంపీపీ తాటికొండ శ్రీనివాసరావు, జడ్పీటీసీ మారం వెంకటరెడ్డి, వైఎస్‌ఎంపీపీ ఐ.వెంకటేశ్వరరెడ్డి, సర్పంచ్ చార్లెస్ సర్జన్, టీడీపీ నాయకుడు వేణుబాబులు కలిసి పుష్పగుచ్ఛం అందజేసి స్వాగతం పలికారు. కార్యక్రమంలో జేసీ గోపాలకృష్ణ, ఇన్‌చార్జ్ ఆర్‌డీవో కళావతి, నేషనల్ హైవే పీడీ అనీల్‌కుమార్, తహసీల్దార్ బీవీ రమణారావు, తదితరులు పాల్గొన్నారు.