టెన్నికాయిట్‌లో బాలబాలికల సత్తా
ABN , Publish Date - Nov 10 , 2025 | 01:31 AM
స్థానిక ఎన్‌ఆర్‌అండ్‌పీఎం హైస్కూల్లో రెండురోజులుగా జరుగుతున్న 42వ రాష్ట్రస్థాయి ఇంటర్ డిస్ర్టిక్ట్ జూనియర్ టెన్ని కాయిట్ పోటీలు విజయవంతంగా ముగిశాయి.
చీరాల, నవంబరు9 (ఆంధ్రజ్యోతి) : స్థానిక ఎన్‌ఆర్‌అండ్‌పీఎం హైస్కూల్లో రెండురోజులుగా జరుగుతున్న 42వ రాష్ట్రస్థాయి ఇంటర్ డిస్ర్టిక్ట్ జూనియర్ టెన్ని కాయిట్ పోటీలు విజయవంతంగా ముగిశాయి. జిల్లా అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన పోటీల్లో రాష్ట్రంలోని 19 జిల్లాల నుంచి సుమారు 200 మంది బాలబాలికలు ఉత్సాహంగా పాల్గొన్నారు. క్రీడా కారులకు భోజన, ఇతర సౌకర్యాలను నియోజకవర్గ టీడీపీ అధికార ప్రతినిధి మహేంద్రనాధ్ ఏర్పాటు చేయగా, ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే హాజరై విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా మాట్లా డుతూ పిన్నవయసులో దూరాభారం ఆలోచించ కుండా పోటీల్లో పాల్గొనడం అభినందనీయమన్నారు. హోరాహోరీగా చిన్నారులు పోటీల్లో పాల్గొనడంపై హర్షం వ్యక్తం చేశారు. పోటీల్లో ఒకరిద్దరు క్రీడాకారుల వైఫల్యాలను సున్నితంగా వివరించి పోటీ తత్వాన్ని తెలియజేశారు. పోటీల్లో బాలుర విభాగంలో వెస్ట్ గోదావరికి చెందిన పవన్ ప్రథమ స్థానం దక్కించు కోగా, రెండవ బహుమతి విజయనగరానికి చెందిన శివ శంకరప్రసాద్, మూడవ స్థానంలో కాకినాడకు చెందిన సత్యనారాయణ ఉన్నారు. అలాగే బాలికల విభాగంలో అనంతపూర్‌కు చెందిన జి. సుప్రియ ప్రథమస్థానంతో సత్తాచాటింది. రెండవ స్థానంలో అనంతపూర్‌కు చెందిన కే.జ్యోతిక, మూడవ బహుమతి విజయనగరానికి చెందిన ఇందు సాధించింది. దీంతో క్రీడాకారులను ప్రత్యేకంగా అభినందించారు.
చీరాల : తెలుగు సంవత్సరంలో కార్తీక మాసం అత్యంత పవిత్రమైనదని ఎమ్మెల్యే కొండయ్య చెప్పారు. పేరాల ముత్యాలమ్మపేటలో యువజన సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ప్రత్యేక పూజల్లో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ మాసంలో సముద్రస్నానాలను పుణ్యకార్యంగా భక్తులు భావిస్తారన్నారు.ు. నిర్వాహకుల ద్వారా ప్రత్యేక పూజలు, వన సమారాధనలో పాల్గొన్నారు. అలాగే రామాపురంలో నూతన రిసార్ట్‌ను ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. పర్యాటక రంగాభివృద్ధికి రిసార్ట్స్ నిర్వహణ అవసరమన్నారు. అలాగే పచ్చ మొగిలిలో నిర్వహిస్తున్న యాదవ కార్తీక వన సమారాధనలో సీఐ సుబ్బారావుతో కలిసి హాజరయ్యారు. కార్యక్రమంలో పలువురు కూటమి నాయకులు, కార్యకర్తలు, యాదవ సామాజిక వర్గం ప్రముఖులు హాజరయ్యారు.