ఆ ప్రజాప్రతి‘నిధులకు చెక్’!
ABN , Publish Date - Mar 13 , 2025 | 02:37 AM
గత ప్రభుత్వ హయాంలో వైసీపీ నాయకులు ఇష్టానుసారం నిధుల దోపిడీకి పాల్పడ్డారు. పంచాయతీ పాలకవర్గాలు వారి చేతుల్లోనే ఉండటంతో పనులు చేయకుండానే చేసినట్లు చూపి నిధులు స్వాహా చేశారు. ప్రధానంగా సర్పంచ్‌లు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారు.

గతంలో ఇష్టారీతిన నిధులను బొక్కేసిన వైనం
ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్న సర్పంచ్‌ల అక్రమాలు
వారం వ్యవధిలో నలుగురి చెక్‌పవర్ తాత్కాలికంగా రద్దు
నాలుగు చోట్లా రూ.52.64 లక్షలు స్వాహా చేసినట్లు విచారణల్లో వెల్లడి
అనేక పంచాయతీలపై వెల్లువెత్తుతున్న ఫిర్యాదులు
కొండపి మండలంలోని పెదకండ్లగుంట సర్పంచ్ పంచాయతీ నిధులను దుర్వినియోగం చేశారని 7వ వార్డు సభ్యుడు టి.చెంచయ్య ఇటీవల గ్రీవెన్స్‌లో ఫిర్యాదు చేశారు. దీనిపై ఈవోఆర్డీ, ఒంగోలు డీఎల్పీవోలు విచారించారు. నిధులు వ్యక్తిగత ఖాతాకు సర్పంచ్ జమ చేసుకోవడంతోపాటు, నిబంధనలకు విరుద్ధంగా రికార్డులు నిర్వహించారని తేల్చారు. దీంతో సర్పంచ్ చెక్ పవర్‌ను రద్దుచేస్తూ ఉన్నతాధికారి ఉత్తర్వులు ఇచ్చారు.
సీఎ్‌సపురం మండలంలోని కోవిలంపాడు పంచాయతీలో 15వ ఆర్థిక సంఘం నిధులు రూ. 3లక్షలు దుర్వినియోగం చేసినందుకు సర్పంచ్ షేక్ ఖాదర్‌బీ చెక్ పవర్‌ను రద్దు చేశారు. స్టాకు రిజిస్టర్ లేకుండా ఇన్‌వాయిస్ ద్వారా చెల్లించడం, ఎంబుక్ రికార్డు చేయకపోవడం తదితర ఆరోపణలపై విచారణ చేశారు. ఈవోపీఆర్డీకి చెక్‌పవర్ అప్పగిస్తూ జిల్లా కార్యాలయం నుంచి ఉత్తర్వులు అందాయి.
గత ప్రభుత్వ హయాంలో వైసీపీ నాయకులు ఇష్టానుసారం నిధుల దోపిడీకి పాల్పడ్డారు. పంచాయతీ పాలకవర్గాలు వారి చేతుల్లోనే ఉండటంతో పనులు చేయకుండానే చేసినట్లు చూపి నిధులు స్వాహా చేశారు. ప్రధానంగా సర్పంచ్‌లు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారు. ప్రస్తుతం ఆయా పనులపై ఫిర్యాదులు వెల్లువెత్తుతుండటంతో అధికారులు విచారణ చేస్తున్నారు. దీంతో అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగుచూస్తున్నాయి. ఈ నేపథ్యంలో బాధ్యులపై డీపీవో చర్యలు తీసుకుంటున్నారు.
ఒంగోలు కలెక్టరేట్, మార్చి 12 (ఆంధ్రజ్యోతి) : జిల్లాలోని అనేక గ్రామ పంచాయతీల్లో సర్పంచ్‌లు నిధులను బొక్కేశారు. నిబంధనలకు అనుగుణంగా పంచాయతీ తీర్మానాలు చేసి ఖర్చుచేయాల్సి ఉన్నా తమదే పెత్తనం అన్న రీతిలో వ్యవహరించారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో జిల్లాలో 90శాతానికిపైగా పంచాయతీ పాలకవర్గాలు ఆ పార్టీ సానుభూతిపరుల చేతుల్లోకే వెళ్లాయి. అప్పటి నుంచి నేటి వరకూ పంచాయతీల్లో పనులు చేయకుండా చేసినట్లుగా తప్పుడు రికార్డులు సృష్టించి నిధులు స్వాహా చేశారు. ఆయా పంచాయతీల్లో జరిగిన అవినీతి, అక్రమాలపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో జిల్లాలోని నాలుగు పంచాయతీల్లో అక్రమాలపై ఎక్కువగా ఫిర్యాదులు రావడంతో జిల్లా పంచాయతీ అధికారి గొట్టిపాటి వెంకటనాయుడు ఆదేశాల మేరకు విచారణ చేయడంతో నిధులు నిబంధనలకు విరుద్ధంగా ఖర్చు చేసినట్లు తేలింది.
నిబంధనలకు విరుద్ధంగా..
నాలుగు పంచాయతీల్లో సుమారు రూ.52.64లక్షల నిధులను అక్రమంగా ఖర్చుచేయడంతో ఆయా సర్పంచ్‌ల చెక్‌పవర్‌ను తాత్కాలికంగా రద్దుచేస్తూ డీపీవో ఉత్తర్వులు జారీచేశారు. 14, 15వ ఆర్థిక సంఘం నిధులతోపాటు పంచాయతీలకు వచ్చే సాధారణ నిధులను కూడా ఇష్టారీతిన ఖర్చుచేశారు. ఏదైనా పంచాయతీల్లో పనులు చేయాలంటే పాలకవర్గ సమావేశంలో చర్చించి తీర్మానం చేయాలి. కానీ అందుకు భిన్నంగా ఆయా పంచాయతీల్లో నిధులను వాడేసుకున్నారు. సీఎస్‌పురం మండలం కోవిలంపాడు పంచాయతీలో రూ.4.80లక్షలు, హనుమంతునిపాడు మండలం లింగంగుంటలో రూ.5.14లక్షలు, కొండపి మండలం పెద్దకండ్లగుంటలో రూ.31.45 లక్షలు, పామూరు మండలం మోపాడు పంచాయతీలో రూ.11.27లక్షల నిధులు దుర్వినియోగమయ్యాయి.
సమగ్ర విచారణకు ఆదేశం
నిధుల దుర్వినియోగం ఆరోపణలు నిజమని ప్రాథమికంగా వెల్లడవుతుండటంతో ఆయా పంచాయతీ సర్పంచ్‌ల చెక్‌పవర్‌ను తాత్కాలికంగా రద్దుచేశారు. అక్కడ ఈవోఆర్‌డీ, గ్రామ పంచాయతీ కార్యదర్శి జాయింట్ సిగ్నేచర్‌తో అవసరమైతే పంచాయతీ నిధులు వినియోగించుకునే విధంగా జిల్లా పంచాయతీ అధికారి ఉత్తర్వులు జారీచేశారు. ఆయా పంచాయతీల్లో నిధుల దుర్వినియోగంపై సమగ్ర విచారణకు ఆదేశాలు ఇచ్చారు. అవినీతికి పాల్పడినట్లు రుజువైతే సర్పంచ్‌లకు ఉద్వాసన పలికే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇలా జిల్లాలోని పలు పంచాయతీల్లో జరిగిన అక్రమాలపై నిత్యం జిల్లా అధికారులకు అర్జీలు అందుతునే ఉన్నాయి. ప్రతి సోమవారం కలెక్టరేట్‌లో జరిగే గ్రీవెన్స్‌సెల్‌లో కూడా పలు పంచాయతీల్లో జరిగిన అవినీతి, అక్రమాలపై ఫిర్యాదుల పరంపర కొనసాగుతూనే ఉంది. డీవోను ఆదేశించారు.
సింగరాయకొండలోనూ అదే పరిస్థితి
సింగరాయకొండ గ్రామపంచాయతీలో గత రెండేళ్ల నుంచి సర్పంచ్‌పై అవినీతి ఆరోపణలు వెల్లువెత్తాయి. వాటిపై విచారణ జరిపారు. నిధుల దుర్వినియోగం వాస్తవమే అని తేలింది. అయినా ప్రతిరోజు ఏదో ఒక ఆరోపణ పంచాయతీపై వస్తూనే ఉంది. ఇటీవల ప్రైవేటు వ్యక్తుల ద్వారా ఇంటి పన్నులు వసూలు చేయిస్తున్నారన్న ఆరోపణలు వ్యక్తం అవుతున్నాయి. గత వైసీపీ ప్రభుత్వ హయంలో పంచాయతీలకు నిధులు అంతంతమాత్రంగానే రాగా వచ్చిన వాటిని కూడా ఆ పార్టీ సానుభూతిపరులు అధికారాన్ని అడ్డుగా పెట్టుకొని బొక్కేశారనే విమర్శలున్నాయి. ఆయా పంచాయతీల్లో జరిగిన అవినీతి, అక్రమాలను వెలికితీసి సంబంధిత బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఆయా గ్రామ పంచాయతీల ప్రజానీకం కోరుతున్నారు.
పామూరు మండలం మోపాడు పంచాయతీకి చెందిన రూ.2.82లక్షలను సర్పంచ్ దుర్వినియోగం చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. పంచాయతీ కార్యదర్శి సంతకాలు లేకుండానే మోటార్ల మరమ్మతులు, బ్లీచింగ్ పౌడర్ కొనుగోలు చేసినట్లు చూపి ఆ మొత్తాన్ని సర్పంచ్ స్వాహా చేసినట్లు అధికారుల విచారణలో తేలింది. అలాగే గత టీడీపీ ప్రభుత్వ హయాంలో ఉపాధి హామీ కింద చేపట్టిన పనులకు సంబంధించిన రూ.9లక్షల బిల్లులను కూడా వైసీపీ హయాంలో వచ్చాయి. వాటిని పనులు చేసిన దేవరపు మాల్యాద్రికి చెల్లించకుండా అక్రమంగా డ్రా చేసుకున్నట్లు సర్పంచ్‌పై ఫిర్యాదులు వచ్చాయి. ఈ నేపఽథ్యంలో విచారణ చేసి చెక్‌పవర్‌ను రద్దుచేశారు.
హనుమంతునిపాడు మండలం లింగంగుట్ల గ్రామ సర్పంచ్ రూ.5లక్షల మేర నిధులు దుర్వినియోగం చేసినట్లు అభియోగాలు వచ్చాయి. గత వైసీపీ ప్రభుత్వంలో పనులు చేయకుండానే నిధులు గోల్‌మాల్ చేశారని ఆ గ్రామానికి చెందిన వారు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు విచారణ చేపట్టిన అధికారులు సర్పంచ్ చెక్‌పవర్ రద్దు చేశారు. సమగ్ర విచారణకు ఎంపీ