Share News

ఆ చానల్‌, పేపర్‌ను మూసివేయించాలి

ABN , Publish Date - Jun 10 , 2025 | 11:14 PM

రాష్ట్ర రాజధాని అమరావతి మహిళల పట్ల నీచంగా మాట్లాడిన సాక్షి చానల్‌, పేపర్‌ను మూసివేయించాలని మంగళవారం తెలుగుదేశం పార్టీ మహిళలు నల్లబెలూన్లతో భారీ నిరసన ర్యాలీ చేశారు.

ఆ చానల్‌, పేపర్‌ను మూసివేయించాలి
నల్లబెలూన్లతో నిరసన ర్యాలీ చేస్తున్న మహిళా నాయకులు

మహిళా నాయకుల నిరసన

కంభం, జూన్‌ 10 (ఆంధ్రజ్యోతి) : రాష్ట్ర రాజధాని అమరావతి మహిళల పట్ల నీచంగా మాట్లాడిన సాక్షి చానల్‌, పేపర్‌ను మూసివేయించాలని మంగళవారం తెలుగుదేశం పార్టీ మహిళలు నల్లబెలూన్లతో భారీ నిరసన ర్యాలీ చేశారు. అనంతరం కందులాపురం సెంటర్‌లోని అంబేడ్కర్‌ విగ్రహానికి వినతిపత్రం అందచేశారు. టీడీపీ నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు తోట మహాలక్ష్మి, జడ్పీటీసీ సభ్యులు కొత్తపల్లి జ్యోతి మాట్లాడుతూ సాక్షి చానల్‌ రిపోర్టర్‌ కొమ్మినేని, జర్నలిస్టు క్రిష్ణంరాజుపై కఠిన చర్యలు తీసుకోవడంతోపాటు సంస్థను మూసివేయించాలని డిమాండ్‌ చేశారు.

మహిళలను అవమానపరిచేలా మాట్లాడినప్పటికీ ఆ చానల్‌ ఎండీ భారతిరెడ్డి ఖండించడం గానీ, క్షమాపణ చెప్పడం గానీ చేయకపోవడం సిగ్గుచేటన్నారు. మహిళలంటే గౌరవం లేకే జగన్‌రెడ్డి తల్లిని, చెల్లిని ఇంటి నుంచి గెంటేశారని ధ్వజమన్నారు. కార్యక్రమంలో కంభం టౌన్‌ టీడీపీ మహిళ అధ్యక్షురాలు ఆరేపల్లి సుభాషిని, అర్ధవీడు మండల నాయకురాలు కత్తి భారతి, పలువురు మహిళా కార్యకర్తలు పాల్గొన్నారు.

ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి

గిద్దలూరు : అమరావతి ఔన్నత్యాన్ని, అక్కడి మహిళల గౌరవాన్ని దెబ్బతీసే విధంగా సాక్షి చానల్‌లో అవమానకర వ్యాఖ్యలు చేసిన క్రిష్ణంరాజు, కొమ్మినేనిలపై ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని ప్రజా సంకల్ప వేదిక రాష్ట్ర శాఖ అధ్యక్షులు, హైకోర్టు న్యాయవాది మదిరె రంగసాయిరెడ్డి మంగళవారం ప్రకటనలో కోరారు. జర్నలిస్టుగా, పత్రిక సంపాదకులుగా బాధ్యతాయుతంగా ఉండాల్సిన క్రిష్ణంరాజు, కొమ్మినేని మహిళలను అలా అసభ్య వ్యాఖ్యలు చేయడాన్ని ఆయన ఖండించారు.

Updated Date - Jun 10 , 2025 | 11:14 PM