Share News

ఆర్టీసీ బస్టాండ్‌ మంజూరుపై కృతజ్ఞతలు

ABN , Publish Date - Dec 11 , 2025 | 09:35 PM

దోర్నాల మండల ప్రజలు ఎన్నాళ్లుగా ఎదురు చూస్తున్న ఆర్టీసీ బస్టాండ్‌ నిర్మాణానికి కలెక్టర్‌ పరిపాలనా అనుమతులు మంజూరు చేయడాన్ని కూటమి నాయకులు స్వాగతిస్తున్నారు.

ఆర్టీసీ బస్టాండ్‌ మంజూరుపై కృతజ్ఞతలు
చిత్రపటాలకు పాలాభిషేకం చేస్తున్న నాయకులు

ఎరిక్షన్‌బాబు చిత్రపటానికి

పాలాభిషేకం చేసిన నాయకులు

పెద్దదోర్నాల, డిసెంబరు 11 (ఆంధ్రజ్యోతి) : దోర్నాల మండల ప్రజలు ఎన్నాళ్లుగా ఎదురు చూస్తున్న ఆర్టీసీ బస్టాండ్‌ నిర్మాణానికి కలెక్టర్‌ పరిపాలనా అనుమతులు మంజూరు చేయడాన్ని కూటమి నాయకులు స్వాగతిస్తున్నారు. అందుకు కృషి చేసిన టీడీపీ ఇన్‌చార్జి గూడూరి ఎరిక్షన్‌బాబుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ గూడూరితో పాటు ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవణ్‌కల్యాణ్‌ చిత్రపటాలకు గురువారం పాలాభిషేకం చేశారు. కార్యక్రమంలో సొసైటీ మండల అధ్యక్షుడు బట్టు సుధాకర్‌రెడ్డి, టీడీపీ నాయకులు దొడ్డా శేషాద్రి, చంటి, దేసు నాగేంద్రబాబు, ఎలకపాటి చెంచయ్య, పీ రామిరెడ్డి, దానం,షేక్‌ మౌలాలి, ఖాన్‌, రఫీ, సుబ్బారెడ్డి, నరసింహారావు, ప్రసాద్‌ పాల్గొన్నారు.

Updated Date - Dec 11 , 2025 | 09:35 PM