Share News

రేపటి నుంచి టెట్‌

ABN , Publish Date - Dec 09 , 2025 | 02:12 AM

టీచర్స్‌ ఎలిజిబులిటీ టెస్టు (టెట్‌) బుధవారం నుంచి ఈనెల 21వతేదీ వరకు నిర్వహిస్తున్నట్లు జిల్లా విద్యాశాఖాధికారి కిరణ్‌కుమార్‌ ఒక ప్రకటనలో తెలిపారు. అందుకోసం ఎనిమిది కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు.

రేపటి నుంచి టెట్‌

అభ్యర్థులు గంటన్నర ముందే చేరుకోవాలి

డీఈవో కిరణ్‌కుమార్‌

ఒంగోలు కలెక్టరేట్‌, డిసెంబరు 8 (ఆంధ్రజ్యోతి) : టీచర్స్‌ ఎలిజిబులిటీ టెస్టు (టెట్‌) బుధవారం నుంచి ఈనెల 21వతేదీ వరకు నిర్వహిస్తున్నట్లు జిల్లా విద్యాశాఖాధికారి కిరణ్‌కుమార్‌ ఒక ప్రకటనలో తెలిపారు. అందుకోసం ఎనిమిది కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు పరీక్షలు జరుగుతాయన్నారు. కృష్ణచైతన్య ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ అండ్‌ సైన్సెస్‌ (పెద్దారవీడు), డాక్టర్‌ శామ్యూల్‌ జార్జి ఇంజనీరింగ్‌ కళాశాల (మార్కాపురం), ఒంగోలులోని నేషనల్‌ కౌన్సిల్‌ ఫర్‌ ది చర్చి సోషియల్‌ యాక్షన్‌ ఇండియా, నెల్లూరు బస్టాండు సమీపంలోని బ్రిలియంట్‌ కంప్యూటర్‌ ఎడ్యుకేషన్‌, పేస్‌, క్విస్‌, రైజ్‌ ఇంజనీరింగ్‌ కళాశాలల్లో ఈ పరీక్షలు ఆన్‌లైన్‌లో జరుగుతాయన్నారు. అభ్యర్థులు నిర్దేశిత సమయాని కంటే గంటన్నర ముందు కేంద్రాలకు చేరుకోవాలన్నారు. సెల్‌ఫోన్స్‌, జామెంట్రీ బాక్సులు, ఎలక్ర్టికల్‌ వస్తువులను అనుమతించమన్నారు. టెట్‌ కోసం డీఈవో కార్యాలయంలో గ్రీవెన్స్‌ సెల్‌ను కూడా ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

Updated Date - Dec 09 , 2025 | 02:12 AM