ఉపాధ్యాయుని సెల్‌ఫోన్ చోరీ
ABN , Publish Date - Oct 22 , 2025 | 12:38 AM
ప్రభుత్వ ఉపాధ్యాయుడు ఎం ఈశ్వరప్రసాద్ జేబులో నుంచి సెల్‌ఫోన్ ను క్షణాల్లో తస్కరించి అగంతకుడు పారిపోయిన వైనం సోమవారం మార్టూరు సెంటర్లో చోటుచేసుకొంది.
మార్టూరు, అక్టోబరు 21 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ ఉపాధ్యాయుడు ఎం ఈశ్వరప్రసాద్ జేబులో నుంచి సెల్‌ఫోన్ ను క్షణాల్లో తస్కరించి అగంతకుడు పారిపోయిన వైనం సోమవారం మార్టూరు సెంటర్లో చోటుచేసుకొంది. అందుకు సంబందించిన వివరాలు ఇలా ఉన్నాయి. మద్యాహ్న సమయంలో ఒక పూలదుకాణం వద్ద పూలును కొనుగోలు చేస్తున్న ఉపాధ్యాయుని వద్దకు సుమారు పాతికేళ్లుయువకుడు వచ్చి, సార్ మీ డబ్బులు కిందపడిపోయాయని చెప్పాడు. దీంతో ఈ డబ్బులు తనవి కావని ఉపాధ్యాయుడు చెప్పడంతో, సరే నంటూ ఆ యువకుడు కింద నేలమీద ఉన్న డబ్బులను తీసుకున్నాడు. అదే క్షణంలో ఉపాధ్యాయుని జేబులోని రూ. 40 వేల విలువైన సెల్‌ఫోన్‌ను తస్కరించాడు. తర్వాత మరో యువకునిపై క్షణాల్లోనే వెళ్లిపోయాడు. అప్పటికీ, ఉపాధ్యాయుడు తన సెల్‌ఫోన్ పోయిన విషయం గమనించలేదు. కాని పూలదుకాణం యజమాని సార్ మీ జేబునుంచి యువకుడు ఏదో తీశాడంటూ ఉపాధ్యాయునికి చెప్పడంతో, ఆశ్చర్య పోవడం ఉపాధ్యాయుడి వంతైంది. జేబు తడుముకుంటే, జేబులోని సెల్ ఫోన్ కనిపించలేదు. దీంతో ఈ యువకుడు సెల్‌ఫోన్‌ను కాజేశాడని గ్రహించిన ఉపాధ్యాయుడు,వెంటనే తన కుమారునికి ఫోన్ చేసి ఫోన్ లో ఉన్న సిమ్ నంబరును బ్లాక్ చేయించాడు. తరువాత ఈ విషయాన్ని మార్టూరు స్టేషన్‌లో పోలీసులు దృష్టికి తీసుకువెళ్లాడు. అక్కడ షరా మామూలే... ఈ సెల్‌ఫోన్ దొంగతనాలు ఎక్కువయ్యాయని పేర్కొంటూ పోలీసులు విచారిస్తున్నారు.