Share News

స్ఫూర్తి ప్రదాతలు గురువులు

ABN , Publish Date - Sep 06 , 2025 | 02:38 AM

సమాజానికి దిశా నిర్దేశం చేసే స్ఫూర్తిప్రదాతలు గురువులని జాయింట్‌ కలెక్టర్‌ ఆర్‌.గోపాలకృష్ణ అన్నారు. స్థానిక కలెక్టరేట్‌లోని స్పందన హాలులో శుక్రవారం విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లాస్థాయి గురుపూజోత్సవ కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. విద్యార్థులను ఉన్నత వ్యక్తిత్వం గల పౌరులుగా తీర్చిదిద్దే గురుతర బాధ్యత ఉపాధ్యాయులపై ఉన్నదన్నారు.

స్ఫూర్తి ప్రదాతలు గురువులు
గురుపూజోత్సవ సభలో మాట్లాడుతున్న జేసీ గోపాలకృష్ణ, వేదికపై ఎమ్మెల్యే బీఎన్‌, మారిటైం బోర్డు చైర్మన్‌ సత్య, మేయర్‌ సుజాత

జాయింట్‌ కలెక్టర్‌ గోపాలకృష్ణ

ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవం

53 మంది ఉత్తమ టీచర్లకు అవార్డుల ప్రదానం

ఒంగోలు విద్య, సెప్టెంబరు 5 (ఆంధ్రజ్యోతి) : సమాజానికి దిశా నిర్దేశం చేసే స్ఫూర్తిప్రదాతలు గురువులని జాయింట్‌ కలెక్టర్‌ ఆర్‌.గోపాలకృష్ణ అన్నారు. స్థానిక కలెక్టరేట్‌లోని స్పందన హాలులో శుక్రవారం విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లాస్థాయి గురుపూజోత్సవ కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. విద్యార్థులను ఉన్నత వ్యక్తిత్వం గల పౌరులుగా తీర్చిదిద్దే గురుతర బాధ్యత ఉపాధ్యాయులపై ఉన్నదన్నారు. అయితే ఇటీవల వారు ఎందుకో వెనుకబడుతున్నారన్నారు. దీనిపై ఒకసారి ఆత్మావలోకనం చేసుకొని తమ ధర్మానికి పునరంకితమై విద్యార్థులను గొప్ప వ్యక్తులుగా తీర్చిదిద్దాలని సూచించారు. సంతనూతలపాడు ఎమ్మెల్యే బీఎన్‌ విజయ్‌కుమార్‌ మాట్లాడుతూ విద్యార్థులను ఉన్నతులుగా తీర్చిదిద్దే బాధ్యత గురువులదేనన్నారు. సమాజాన్ని సన్మార్గంలో నడిపించే ఉన్నతులుగా విద్యార్థులను తయారు చేయాలన్నారు. రాష్ట్ర మారిటైం బోర్డు చైర్మన్‌ దామచర్ల సత్యనారాయణ మాట్లాడుతూ విద్యారంగాన్ని ప్రక్షాళన చేసి విద్యార్థులను ఉన్నతంతా తీర్చిదిద్దేందుకు ప్రజా ప్రభుత్వం కృషి చేస్తున్నదని తెలిపారు. విద్యకు ఏటా 30వేల కోట్లు ఖర్చు చేస్తున్నదన్నారు. పాఠశాలల్లో అన్ని సదుపాయమాల కల్పనకు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌ కృషి చేస్తున్నారని తెలిపారు. ఉపాధ్యాయులు ప్రభుత్వం ఇస్తున్న సహకారాన్ని అందిపుచ్చుకొని సత్ఫలితాలు తేవాలని కోరారు. డీఈవో కిరణ్‌కుమార్‌ అధ్యక్షతన జరిగిన సభలో మేయర్‌ గంగాడ సుజాత, డీఆర్వో చినఓబులేశు తదితరులు పాల్గొన్నారు. ఈసందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. జిల్లా ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికైన 53 మందిని సన్మానించారు. వారికి అవార్డులను ప్రదానం చేశారు.

Updated Date - Sep 06 , 2025 | 02:38 AM