Share News

కార్యకర్తల సంక్షేమమే టీడీపీ లక్ష్యం

ABN , Publish Date - Oct 30 , 2025 | 10:29 PM

కార్యకర్తల సం క్షేమమే టీడీపీ లక్ష్యమని ఎమ్మెల్యే డాక్టర్‌ ఉగ్రనరసిం హారెడ్డి అన్నారు. స్థానిక అమరావతి గ్రౌండ్స్‌లో గురు వారం సీఎం సహాయనిధి కింద రూ.36లక్షల 68వేల 368మేర చెక్కులను పంపిణీ చేశారు.

కార్యకర్తల సంక్షేమమే టీడీపీ లక్ష్యం
సీఎం సహాయనిధి చెక్కులను పంపిణీ చేస్తున్న ఎమ్మెల్యే డాక్టర్‌ ఉగ్రనరసింహారెడ్డి

ఎమ్మెల్యే డాక్టర్‌ ఉగ్రనరసింహారెడ్డి

సీఎం సహాయనిధి చెక్కుల పంపిణీ

కనిగిరి, అక్టోబరు 30 (ఆంధ్రజ్యోతి): కార్యకర్తల సం క్షేమమే టీడీపీ లక్ష్యమని ఎమ్మెల్యే డాక్టర్‌ ఉగ్రనరసిం హారెడ్డి అన్నారు. స్థానిక అమరావతి గ్రౌండ్స్‌లో గురు వారం సీఎం సహాయనిధి కింద రూ.36లక్షల 68వేల 368మేర చెక్కులను పంపిణీ చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు ఎలాంటి ఆపద వచ్చినా మంత్రి నారా లోకే ష్‌ అండగా నిలుస్తున్నారన్నారు. కనిగిరి మండలంలోని ఏరువారిపల్లి గ్రామానికి చెందిన ముప్పూరి వెంకట లక్ష్మీకి అనారోగ్యం ఏర్పడిందన్నారు. దీంతో వారు హై ద్రాబాద్‌లో ఓ ప్రయివేటు ఆసుపత్రిలో వైద్యం చేయిం చుకున్నట్టు చెప్పారు. వైద్యానికి అయిన ఖర్చుతో కూడి న బిల్లులను కనిగిరి ఆఫీస్‌ నుంచి సీఎం సహాయనిధి కోరుతూ అర్జీ దాఖలు చేసినట్లు తెలిపారు. వెంటలక్ష్మీ వైద్యం చేయించుకున్న ఆసుపత్రికి సీఎం సహాయనిధికి అర్హత లేకపోవటంతో ఆ దరఖాస్తును తిరస్కరించినట్టు చెప్పారు. పలుమార్లు సీఎం సహాయనిధి కోరినా ఫలి తం లేకుండా పోయిందని ఎమ్మెల్యే డాక్టర్‌ ఉగ్ర వివరించారు. బాధిత మహిళ ముప్పూరి వెంకటలక్ష్మీ భర్త ముప్పూరి వెంకటేశ్వర్లు నేరుగా సెల్‌ మాధ్యమం ద్వారా మంత్రి లోకేష్‌కు తన ఆర్థిక స్థితిని, జరిగిన వైదాన్ని, తిరస్కరించిన తీరును వివరిస్తూ ఎక్స్‌ ద్వారా మెస్‌జ్‌ చేశాడని చెప్పారు. వెంటనే మంత్రి లోకేష్‌ స్పందించి నేరుగా తనకు ఫోన్‌ చేసినట్టు ఎమ్మెల్యే డాక్టర్‌ ఉగ్ర తెలిపారు. వెంకటేశ్వర్లు పార్టీకి విధేయుడిగా ఉండట మే కాకుండా టీడీపీ కార్యక్రమాలను నిర్వహిస్తూ ఎం తో కృషి చేసినట్లు మంత్రి లోకేష్‌కు వివరించానన్నారు. మంత్రి సానుకూలంగా స్పందించి వెంకటలక్ష్మీకి సీఎం సహాయనిధి కింద రూ.67 వేలు మంజూరు చేస్తూ చెక్కును పంపినట్లు ఎమ్మెల్యే తెలిపారు.

Updated Date - Oct 30 , 2025 | 10:29 PM